అభిమానంతోనే ముద్దు పెట్టుకున్నా...!

Update: 2018-11-14 11:05 GMT
బెల్లంకొండ శ్రీనివాస్‌ - కాజల్‌ జంటగా తెరకెక్కిన ‘కవచం’ మూవీ వేడుకలో చోటా కే నాయుడు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. స్టేజ్‌ పై అందరి ముందు కాజల్‌ ను ముద్దు పెట్టుకున్న చోటా కే నాయుడుపై సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శల వర్షం కురుస్తోంది. తాజా పరిణామంతో గతంలో చోటా కే నాయుడు మాట్లాడిన మాటలు కూడా ఇప్పుడు సోషల్‌ మీడియాలో ప్రత్యక్షం అవుతున్నాయి. ఆడవారి పట్ల ఆయన పలు సార్లు అసభ్యంగా ప్రవర్తించాడని, తెలుగు సినిమా పరిశ్రమ నుండి బహిష్కరించాలని నెటిజన్లు కోరుతున్నారు.

కాజల్‌ ను ముద్దు పెట్టుకున్న విషయమై తాజాగా చోటా కే నాయుడు స్పందించాడు. తాను కాజల్‌ ను ముద్దు పెట్టుకోవడంను సమర్ధించుకున్నాడు. తనకు తెలుగు సినిమా పరిశ్రమలో సౌందర్య అంటే చాలా అభిమానం. ఆమె తర్వాత  కాజల్‌ అంటే అభిమానం. కాజల్‌ కు తాను అభిమానిని అని, అందుకే ఆ అభిమానంతో ఆమెను ముద్దు పెట్టుకున్నాను తప్ప తప్పుడు ఉద్దేశ్యంతో కాదని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు.

చోటా కే నాయుడు ఎంతగా సమర్ధించుకునేందుకు ప్రయత్నించినా కూడా నెటిజన్లు మాత్రం ఊరుకోవడం లేదు. ఆయన తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆడవారి పట్ల నీ ప్రవర్తన మార్చుకోవాల్సిందే అంటూ సలహా ఇస్తున్నారు. అయితే ఈ విషయమై కాజల్‌ రియాక్ట్‌ కాలేదు. ఆమె రియాక్షన్‌ ఏంటీ అనేది నెటిజన్స్‌  ప్రశ్నిస్తున్నారు.

Tags:    

Similar News