చరణ్ లో అదెప్పుడు చూడలేదంటున్న కొరియోగ్రాఫర్ స్వర్ణ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఇండస్ట్రీకి చెందిన వారు చాలా మంది చాలా రకాలుగా చెబుతూ ఉంటారు. ముఖ్యంగా చరణ్ ఒక మెగాస్టార్ కిడ్ అయినా కూడా ఆయన ఎప్పుడు ఆ భావనను కలిగి ఉండరు. సెట్ లో ఉన్న సమయంలో ఆయన సాదారణంగానే ఉంటారు. ఎప్పుడు కూడా ప్రత్యేకంగా ఉండాలని కోరుకోరు అంటూ చరణ్ గురించి ఎంతో మంది ఇప్పటి వరకు చెప్పడం మనం విన్నాం. ఇప్పుడు చరణ్ గురించి కొరియోగ్రాఫర్ స్వర్ణ మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆమె మాటలతో చరణ్ స్థాయి మరింతగా పెరిగినట్లయ్యింది.
కొరియోగ్రాఫర్ స్వర్ణ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చరణ్ పై స్పందించింది. రామ్ చరణ్ ఎప్పుడు కూడా ఒక స్టార్ కిడ్ అను అనే ప్రవర్తన కనబర్చలేదు. అతడు ఎప్పుడు కూడా సెట్ లో ఇతరులకు సాయంగా నిలిచేందుకు ప్రయత్నించడంతో పాటు ప్రతి ఒక్కరిని కూడా గౌరవించడం జరుగుతుంది. ఎదురుగా ఉన్న వారు ఎవరు అనే విషయాన్ని గురించి పట్టించుకోకుండా గౌరవంగా మాట్లాడటమే ఆయనకు తెలుసు. ఏ ఒక్కరిని కూడా చిన్న చూపు చూడకుండా గౌరవంగా మాట్లాడటం నేను గమనించాను అంది. చరణ్ లో ఎప్పుడు కూడా అహంకారంను చూడలేదంది.
ఎదుటి వారు నిల్చుని మాట్లాడితే తాను కూడా నిల్చుని మాట్లాడే వ్యక్తి రామ్ చరణ్. ఇండస్ట్రీలో అతి కొద్ది మందిలో రామ్ చరణ్ ఒకరు అంటూ ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. చరణ్ ఒక పెద్ద ఫ్యామిలీకి చెందిన హీరోను అని కాని.. తానో స్టార్ హీరోను అని కాని ఎలాంటి అభిప్రాయం లేకుండా ఉంటాడు అంటూ చెప్పుకొచ్చారు. చిన్న విషయాల పట్ల కూడా ఆయన స్పందిస్తాడని ప్రతి ఒక్కరి పట్ల గౌరవంగా ఉంటాడని చరణ్ గురించి స్వర్ణ అన్నారు.
ప్రస్తుతం చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమా లో నటిస్తున్న విషయం తెల్సిందే. మరో వైపు చినంజీవితో కలిసి నటించిన ఆచార్య సినిమా కూడా విడుదలకు సిద్దం అవుతోంది. ఈ రెండు సినిమాలతో పాటు దర్శకుడు శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ సినిమాను దిల్ రాజు బ్యానర్ లో చేసేందుకు గాను సిద్దం అవుతున్నాడు. శంకర్ దర్శకత్వంలో చేయబోతున్న సినిమాతో చరణ్ మరింతగా పాన్ ఇండియా ప్రేక్షకులకు చరణ్ దగ్గర అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.