వాటిపై కన్నేసిన కన్నడ, మలయాళ ఇండస్ట్రీలు
కానీ ఎప్పుడైతే కన్నడ నుంచి కెజిఎఫ్, కాంతార, మలయాళ ఇండస్ట్రీ నుంచి లోకా చాప్టర్1 సినిమాలొచ్చాయో అప్పట్నుంచి ఆ ఇండస్ట్రీల రేంజ్ మారిపోయింది.;
సౌత్ సినిమాల క్రేజ్ ఈ మధ్య విపరీతంగా పెరిగింది. కేవలం ఆయా భాషల్లోనే కాకుండా దేశమంతటా ఈ సినిమాలకు మంచి బజ్ ఏర్పడుతుంది. మరీ ముఖ్యంగా బాహుబలి తర్వాత ఈ క్రేజ్ భారీగా ఏర్పడింది. బాహుబలి సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ దక్కడంతో ఆ తర్వాత తెలుగులో భారీ బడ్జెట్ సినిమాలు చాలానే వచ్చాయి.
టాలీవుడ్ నుంచి ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలు
కేవలం భారీ బడ్జెట్ తోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో సినిమాలను రిలీజ్ చేసి దాంతో దేశవ్యాప్తంగా క్రేజ్ ను అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ నుంచి పలు భారీ సినిమాలు రిలీజై టాలీవుడ్ స్థాయిని పెంచాయి. అయితే సౌత్ లో టాలీవుడ్ నుంచి ఎన్ని భారీ బడ్జెట్ సినిమాలొచ్చినా కన్నడ, మలయాళ ఇండస్ట్రీలు మాత్రం భారీ బడ్జెట్ సినిమాలకు దూరంగానే ఉండేవి.
భారీ బడ్జెట్ సినిమాలపై కన్నేసిన కన్నడ, మలయాళ ఇండస్ట్రీలు
కానీ ఎప్పుడైతే కన్నడ నుంచి కెజిఎఫ్, కాంతార, మలయాళ ఇండస్ట్రీ నుంచి లోకా చాప్టర్1 సినిమాలొచ్చాయో అప్పట్నుంచి ఆ ఇండస్ట్రీల రేంజ్ మారిపోయింది. ఒకప్పుడు భారీ బడ్జెట్ సినిమాలకు దూరంగా ఉన్న కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలు ఇప్పుడు సీక్వెల్స్ తో పాన్ ఇండియా క్రేజ్ ను క్రియేట్ చేయడమే కాకుండా, వాటితో ఆడియన్స్ కు విపరీతమైన ఉత్సాహాన్ని సృష్టిస్తున్నారు.
అంతేకాదు, ఇప్పుడు ఈ రెండు ఇండస్ట్రీల నుంచి రానున్న కెజిఎఫ్3, కాంతార చాప్టర్2, లోకా చాప్టర్2 సినిమాల కోసం కేవలం సౌత్ లోని ఆడియన్స్ మాత్రమే కాకుండా నార్త్ లోని ఆడియన్స్ కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాలకు ఇంతగా క్రేజ్ రావడానికి కారణం కెజిఎఫ్, కాంతార ఫ్రాంచైజ్ సినిమాలతో పాటూ లోకా చాప్టర్1 సినిమాలకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ రావడమే.