• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఆర్టీసీ బస్సులో ఆ సినిమా...

ఆర్టీసీ బస్సులో ఆ సినిమా ఆపేశారు.. ఎందుకీ మహిళ నిరసన!

| మరోవైపు నటిపై జరిగిన దాడి కేసు తీర్పు తీవ్ర చర్చనీయాంశంగా మార్న వేళ.. మంజు వారియర్ కూడా స్పందించారు.

By - Raja Ch
Update: 2025-12-15 06:40 GMT

ప్రభుత్వ బస్సులు, ప్రైవేటు బస్సుల్లో ప్రయాణిస్తున్న సమయంలో ప్రయాణికుల ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాలు ప్రదర్శిస్తారన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ సినిమాలో నటించిన నటుడు ఓ కేసులో కీలక నిందితుడిగా ఉన్న పరిస్థితి! దానికి సంబంధించిన తీర్పులో అతడికి శిక్ష పడలేదు! ఈ నేపథ్యంలో బస్సులో అతడు నటించిన సినిమా ప్రదర్శనను ఓ మహిళ అడ్డుకోవడం, అందుకు ఆమెకు మద్దతు దొరకడం చర్చనీయాంశంగా మారింది.

అవును... నటుడు దిలీప్ నటించిన సినిమా ప్రదర్శనను వ్యతిరేకిస్తూ తొలుత ఓ మహిళ, అనంతరం తోటి ప్రయాణికులు నిరసన వ్యక్తం చేయడం కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ (కే.ఎస్.ఆర్.టీ.సీ) బస్సు ప్రయాణం ఉద్రిక్తంగా మారింది. తిరువనంతపురం నుంచి ఉత్తర జిల్లాల వైపు వెళ్తున్న బస్సులో ఈ ఘటన చోటు చేసుకుంది. మహిళల ఆగ్రహానికి, అభ్యంతరానికి గల కారణం కీలకంగా ఉంది.

వివరాళ్లోకి వెళ్తే... 2017లో నాటి నటి లైంగిక వేధింపుల కేసులో మలయాళ నటుడు దిలీప్ కీలక నిందితుడిగా ఉన్నారు! ఈ కేసులో నిందితులు కదులుతున్న కారులో ఆమెపై దాడి చేసి, ఆ సంఘటనను వీడియో తీశారు! ఈ నేపథ్యంలో తాజాగా ఈ కేసులో కేరళ సెషన్స్ కోర్టు ఆరుగురు దోషులకు 20 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించింది. అయితే.. దిలీప్ ను నిర్ధోషిగా ప్రకటించింది.

ఆ నటుడు దిలీప్ నటించిన సినిమా "ఈ పరాక్కుమ్ తలికా" ను బస్సులో ప్రదర్శించడం ప్రారంభించినప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సమయంలో లక్ష్మీ శేఖర్ అనే మహిళ.. ఈ సినిమా ప్రదర్శనపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా... కే.ఎస్.ఆర్.టీ.సీ. బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు తమకు ఇష్టం లేని సినిమాలు చూడాలని బలవంతం చేయకూడదు అంటూ ఆమె స్పందించింది.

ఈ సమయంలో.. ఆమెకు ఓ వర్గం నుంచి వెంటనే మద్దతు లభించింది. ఇందులో భాగంగా... ఆమె అభ్యంతరానికి చాలా మంది మహిళా ప్రయాణికులు సానుకూలంగా స్పందించారు. అదే సమయంలో.. మరికొంతమంది మాత్రం ఆ సినిమాను ప్రదర్శించాలని పట్టుబట్టారు. దీంతో.. పరిస్థితి గమనించిన కండక్టర్ వెంటనే ఆ చిత్రాన్ని నిలిపివేశారు.

స్పందించిన మంజు వారియర్!:

మరోవైపు నటిపై జరిగిన దాడి కేసు తీర్పు తీవ్ర చర్చనీయాంశంగా మార్న వేళ.. మంజు వారియర్ కూడా స్పందించారు. ఈ సందర్భంగా... గౌరవనీయ న్యాయస్థానం పట్ల తనకు గౌరవం ఉందని.. కానీ, ఈ కేసులో బాధితురాలికి న్యాయం ఇప్పటికీ అసంపూర్తిగా ఉందని అన్నారు. ఇదే సమయంలో.. ఈ దారుణమైన చర్యకు ప్లాన్ చే సిన, దానికి వీలు కల్పించిన మనస్సు ఎవరిదైనా సరే అది ఇప్పటికీ స్వేచ్ఛగా నడుస్తోందని.. ఇది భయంకరమైనదని తెలిపారు.




Tags:    
  • dileep 
  • ksrtc 
  • keralabuses 
  • publicscreening 
  • womensupport 
  • moviecontroversy 
  • filmprotest 

Similar News

ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిగా సాయిప‌ల్ల‌విపై మ‌రో ప్ర‌యోగం!

2026-11-11 18:30 GMT

టీటీడీ చైర్మ‌న్ రేసులో సినీ ప్ర‌ముఖులు.. !

2026-11-11 18:30 GMT

నువ్వు ఇండస్ట్రీని ఏలుతావు..యంగ్ హీరోపై అట్లీ మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

2026-11-11 17:30 GMT

దేవరకొండ ఫ్యామిలీ.. ఒక్క సినిమా పడితే!

2026-11-11 16:39 GMT

స్టార్ జాతకాన్ని ముందే పసిగట్టిన త్రివిక్రమ్ శిష్యుడు

2026-11-11 16:38 GMT

6 రోజుల్లో 100 కోట్ల క్ల‌బ్.. సౌత్‌లో ఈ ఒక్క‌డికే

2026-11-11 16:37 GMT

వివేక్‌ సాగర్‌కి జరిగిన నష్టం ఇతర మ్యూజిక్‌ డైరెక్టర్స్‌కి పాఠం..!

2026-11-11 16:37 GMT

అనిరుధ్ పెళ్లి సర్ ప్రైజ్.. ఇక సన్ పిక్చర్స్‌తో కొత్త ఎమోషన్

2026-11-11 16:33 GMT

కావ్య మార‌న్‌తో అనిరుధ్ పెళ్లి మొద‌టి ఫోటో

2026-11-11 14:00 GMT

డేంజర్ జోన్‌లో సీనియర్ హీరోయిన్ల‌ కెరీర్?

2026-11-11 13:30 GMT

స్టార్ డైరెక్ట‌ర్ ఇమేజ్ ని వాడుకోలేక‌పోతున్న ఫ్యామిలీ!

2026-11-11 12:30 GMT

అందానికి ప్రతిరూపాలు..అమ్మ ముద్రతో అలరిస్తున్న స్టార్ కిడ్స్!

2026-11-11 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS