'పతంగ్' ట్రైలర్.. యూత్ కు ఎక్కేటట్లు ఉందే!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రైలర్ వైరల్ గా మారగా.. ప‌తంగుల పోటీ నేపథ్యంతో కామెడీ స్పోర్ట్స్ డ్రామాగా మూవీ ఉండనున్నట్లు తెలుస్తోంది.;

Update: 2025-12-15 06:54 GMT

ఇన్ స్టాగ్రామ్ సెన్సేషన్ ప్రీతి పగడాల, జీ సరిగమప రన్నరప్ ప్రణవ్ కౌశిక్, వంశీ పూజిత్ లీడ్ రోల్స్ లో పతంగ్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. పెర్ఫెక్ట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా పతంగ్ ను ప్రణీత్‌ ప్రత్తిపాటి తెరకెక్కిస్తుండగా.. సినిమాలో ప్రముఖ గాయకుడు ఎస్ .పి.చరణ్ కీలక పాత్రలో కనిపించనుండడం విశేషం.

సినిమాటిక్ ఎలిమెంట్స్ అండ్ రిషన్ సినిమాస్ బ్యానర్‌ పై విజయ్ శేఖర్ అన్నే, సంపత్, సురేష్ కొత్తింటి, నాని బండ్రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తుండగా.. ప్రముఖ నిర్మాత డి. సురేష్ బాబు సమర్పిస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25వ తేదీన సినిమాను గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

అయితే ఇప్పటికే షూటింగ్ పూర్తవ్వగా.. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుతున్నారు. అదే సమయంలో ప్రమోషన్స్ ను కూడా నిర్వహిస్తున్నారు. రీసెంట్ గా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రైలర్ వైరల్ గా మారగా.. ప‌తంగుల పోటీ నేపథ్యంతో కామెడీ స్పోర్ట్స్ డ్రామాగా మూవీ ఉండనున్నట్లు తెలుస్తోంది.

పురాణాల్లో చూసుకుంటే సీత కోసం చాలా మంది పార్టిసిపేట్ చేశారు కదా.. అంటూ హీరోయిన్ చెబుతున్న డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత ప్రీతి పగడాల, వంశీ పూజిత్ లవ్ ట్రాక్ ను చూపించారు. అప్పుడే ప్రణవ్ ఎంట్రీ ఇస్తారు. అక్కడి నుంచి ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇద్దరూ హీరోయిన్ నే లవ్ చేస్తారు. చివరి ఏమైందనేది మూవీగా తెలుస్తోంది.

అయితే ట్రైలర్ ఇప్పుడు ఆడియన్స్ లో మూవీపై ఆసక్తి క్రియేట్ చేస్తుందని చెప్పాలి. వినూత్నమైన కథాంశంతో సినిమా రూపొందుతున్నట్లు చెప్పకనే చెబుతోంది. థియేటర్లలో యూత్ ఫెస్టివల్‌ లా సినిమా ఉంటుందని అర్థమవుతుంది. యువతకు బాగా కనెక్ట్ అయ్యేలా స్టోరీతో మూవీ తీస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

ముఖ్యంగా నటీనటులు కొత్తవాళ్లే అయినా సెటిల్డ్ గా నటించినట్లు కనిపిస్తున్నారు. మేకర్స్ క్వాలిటీ విషయంలో అస్సలు రాజీ పడినట్లు లేదు. కలర్‌ ఫుల్ విజువల్స్‌ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచేలా ఉన్నాయి. సంగీత దర్శకుడు జోస్ జిమ్మి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఓవరాల్ గా ట్రైలర్ మాత్రం.. ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. మరి పతంగ్ మూవీ ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.


Full View
Tags:    

Similar News