బిగ్ బాస్ 9.. సుమన్ శెట్టి 14 వారాల రెమ్యునరేషన్ ఎంత..?
అతను 14 వారాల పాటు హౌస్ లో ఉన్నాడు కాబట్టి మొత్తం 35 లక్షల దాకా బిగ్ బాస్ నుంచి రెమ్యునరేషన్ గా పొందుతాడని తెలుస్తుంది. సీజన్ 9లో సెలబ్రిటీ హోదాలో సుమన్ శెట్టి హౌస్ లోకి వచ్చాడు.;
బిగ్ బాస్ సీజన్ 9లో 14 వ వారం డబల్ ఎలిమినేషన్ లో భాగంగా శనివారం సుమన్ శెట్టి ఎలిమినేషన్ తెలిసిందే. అసలు సుమన్ శెట్టి ఇన్ని వారాలు హౌస్ లో ఉంటాడని కూడా అంచనా వేయలేకపోయారు ఆడియన్స్. అతని ఇన్నోసెన్స్ తో పాటు నిజాయితీ నచ్చి ఇన్ని వారాలు హౌస్ లో ఉంచారు. ఐతే ఫైనల్ వీక్ కి అతన్ని అనర్హుడిని చేశారు ఆడియన్స్. ఎందుకంటే స్వతహాగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల ఆటలో వెనక పడ్డాడు సుమన్ శెట్టి. అందుకే సీజన్ 9 నుంచి మరో వారం ఉందనగా ఎలిమినేట్ అయ్యాడు.
సుమన్ శెట్టి భారీ రెమ్యునరేషన్..
సీజన్ 9 ఏడెమిది వారాల్లో సుమన్ శెట్టి గౌరవ్ కలిసి కెప్టెన్సీ టాస్క్ విన్ అయిన టైంలో అతని ఫాం చూసి ఫైనల్ వీక్ దాకా అదే టాప్ 5లో కూడా సుమన్ ఉంటాడా అనే విధంగా పాజిబిలిటీస్ కనిపించాయి. కానీ సుమన్ శెట్టి ఫైనల్ వీక్ దాకా ఉండకుండానే ఎలిమినేట్ అయ్యాడు. బిగ్ బాస్ 9 లో 14 వారాలకు గాను సుమన్ శెట్టి భారీ రెమ్యునరేషన్ అందుకున్నాడు. వారానికి రెండున్నర లక్షల పారితోషికం తో సుమన్ శెట్టి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాడు.
అతను 14 వారాల పాటు హౌస్ లో ఉన్నాడు కాబట్టి మొత్తం 35 లక్షల దాకా బిగ్ బాస్ నుంచి రెమ్యునరేషన్ గా పొందుతాడని తెలుస్తుంది. సీజన్ 9లో సెలబ్రిటీ హోదాలో సుమన్ శెట్టి హౌస్ లోకి వచ్చాడు. ఐతే అతని మంచితనమే ఇన్నాళ్లు అతన్ని హౌస్ లో కొనసాగేలా చేసింది. హౌస్ లో అందరితో సుమన్ మంచి రిలేషన్ మెయింటైన్ చేశాడు.
హౌస్ లో మంచి ఫ్రెండ్ షిప్..
సీజన్ 9లో సుమన్ తర్వాత భరణి ఎలిమినేషన్ కూడా జరిగింది. ఇద్దరు హౌస్ లో మంచి ఫ్రెండ్ షిప్ కొనసాగించారు. ఇద్దరి ఎలిమినేషన్ టైంలో శనివారం ముస్తఫ్ఫా సాంగ్ ప్లే చేసి చూపించారు నాగార్జున. మొత్తానికి అలా బిగ్ బాస్ సీజన్ 9లో సుమన్ శెట్టి తన మార్క్ చూపించి భారీ రెమ్యునరేషన్ సంపాదించాడు.
సుమన్ శెట్టికి ఈ సీజన్ లో లక్ కూడా ఫేవర్ చేసింది. అతని కన్నా వాయిస్ లో, టాస్క్ లల్లో పవర్ చూపించిన వారు కూడా అనూహ్యంగా బయటకు వెళ్లారు. కానీ సుమన్ తన ఇన్నోసెంట్ తో ఆడియన్స్ మనసులు గెలిచి ఫైనల్ వారానికి ముందు వరకు ఉన్నాడు. ఇంకో వారం మాత్రమే ఉన్న బిగ్ బాస్ హౌస్ నుంచి సుమన్ వెళ్లడం అతను ఆడిన ఆటకి సరైన గుర్తింపు అనేలా చేసింది. ఎందుకంటే అతని కన్నా డిసర్వ్ అనుకున్న వారే టాప్ 5కి అర్హులు కాబట్టి ఆడియన్స్ కూడా సుమన్ ఎలిమినేషన్ సాటిస్ఫై అయ్యారు.