10 ఏళ్లుగా హిట్స్ నిల్.. కానీ ఆఫర్స్ ఫుల్.. కారణమేంటి?

దీంతో నిర్మాతలు థియేట్రికల్ కలెక్షన్లు పైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో గుర్తింపు ఉన్న హీరోలు బాక్సాఫీస్ వద్ద కొంతవరకు కలెక్షన్లు తీసుకురాగలరనే నమ్మకం పెరిగింది.;

Update: 2026-03-17 14:30 GMT

సినీ ఇండస్ట్రీలో హిట్స్, ఫ్లాప్స్ కామనే. కానీ కొంతమంది హీరోల విషయంలో ఓ ఆసక్తికర పరిస్థితి కనిపిస్తోంది. గత దాదాపు పదేళ్లుగా పెద్ద హిట్లు లేకపోయినా.. వారికి అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. టాలీవుడ్ మాత్రమే కాకుండా బాలీవుడ్‌ లో కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతోంది. ఇటీవల ప్రముఖ నిర్మాత-దర్శకుడు కరణ్ జోహార్, హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో మళ్లీ కలిసి సినిమా చేయబోతున్నారనే వార్తలతో ఆ చర్చ మొదలైంది.

దాదాపు 10 ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ అందుకోలేకపోయిన హీరోపై ఇంకా నమ్మకం ఎందుకు పెట్టారనే ప్రశ్న ఇప్పుడు సినీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇదే పరిస్థితి మన తెలుగు ఇండస్ట్రీలో కూడా ఉంది. ఒకప్పుడు యూత్ ఫేవరెట్‌ గా నిలిచిన పలువురు హీరోలు, ప్రస్తుతం 35 నుంచి 40 ఏళ్ల వయసులో ఉన్నప్పటికీ, గత కొన్నేళ్లుగా భారీ విజయాలు సాధించలేకపోతున్నారు.

అయితే వారి సినిమాలు పూర్తిగా ఫెయిల్ అవ్వలేదని, కొన్ని మంచి కంటెంట్‌ తో వచ్చిన చిత్రాలు ప్రేక్షకుల ప్రశంసలు పొందిన విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. అదే సమయంలో కొత్త హీరోలపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం కంటే, ఇప్పటికే గుర్తింపు ఉన్న వారిపై ఇన్వెస్ట్ చేయడం సేఫ్ అని కొందరు మేకర్స్ భావిస్తున్నారని సమాచారం.

కొత్తవారితో తీసిన సినిమాలు అప్పుడప్పుడే హిట్ అవుతుంటే, ఫ్లాప్ లు వచ్చినా తెలిసిన హీరోల మూవీ కనీస వసూళ్లు తెచ్చే అవకాశముందని నిర్మాతలు అంచనా వేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. మరో ముఖ్య కారణం ఓటీటీ మార్కెట్ అంట. ఒకప్పుడు డిజిటల్ ప్లాట్‌ ఫామ్స్ సినిమాలకు మంచి రేట్లు ఇచ్చేవి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి మారిపోయింది. ఓటీటీలు భారీగా పెట్టుబడులు పెట్టడంలో వెనుకంజ వేస్తున్నాయి.

దీంతో నిర్మాతలు థియేట్రికల్ కలెక్షన్లు పైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో గుర్తింపు ఉన్న హీరోలు బాక్సాఫీస్ వద్ద కొంతవరకు కలెక్షన్లు తీసుకురాగలరనే నమ్మకం పెరిగింది. అలాగే ప్రేక్షకుల టేస్ట్ లో కూడా మార్పు కనిపిస్తోంది. కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటే ఏ హీరో సినిమా అయినా ఆదరణ పొందుతుందని ఇటీవల పలువురు సినిమాలు నిరూపించాయి. దీంతో హిట్ లేకపోయినా హీరోకి మార్కెట్ పూర్తిగా పోదనే ఫీలింగ్ ఇండస్ట్రీలో ఎక్కువవుతోంది.

అందుకే గత 10 ఏళ్లుగా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్స్ సాధించలేకపోయిన హీరోలు కూడా వరుసగా కొత్త అవకాశాలు అందుకుంటున్నారు. కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటే ఎప్పుడైనా వారంతా తిరిగి ఫామ్‌ లోకి రావచ్చనే నమ్మకంతో నిర్మాతలు ముందుకు వస్తున్నారని సమాచారం. ఏదేమైనా హిట్ దక్కలేదంటే అవకాశాలు ఉండవనే టైమ్ గడిచిపోయిందని చెప్పాలి. గుర్తింపు, మార్కెట్, సరైన కథ.. ఆ మూడు ఉంటే, ఎంతకాలమైనా హీరోలకు అవకాశాలు వస్తూనే ఉంటాయేమో మరి.

Tags:    

Similar News