సంక్రాంతి చిత్రాలు.. 'అఖండ 2' తీర్పు వచ్చాక నిర్ణయమా?

అయితే ఈసారి సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఉండనున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఏకంగా ఏడు సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి.;

Update: 2025-12-15 05:46 GMT

సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా.. అన్నట్లు సంక్రాంతి వస్తుందే తుమ్మెదా అంటూ పండగకు అంతా సిద్ధమవుతున్నారు. ఫెస్టివల్ ను జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటూనే.. ఏ సినిమా ఎప్పుడు చూడాలనేది ఇప్పటికే ప్లాన్ వేసుకుంటున్నారు. ఎందుకంటే ఆ సీజన్ లో కచ్చితంగా మూవీలు చూడాలని అంతా ఫిక్స్ అయిపోయి ఉంటారు.

అయితే ఈసారి సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఉండనున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఏకంగా ఏడు సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి. అందులో ఐదు స్ట్రయిట్ తెలుగు చిత్రాలు కాగా.. రెండు డబ్బింగ్ వెర్షన్లు. ఏడు చిత్రాలు ఒకటే సీజన్ లో అది కూడా సంక్రాంతికి రిలీజ్ కావడమంటే మామూలు విషయం కాదు.

అనేక సమస్యలు కచ్చితంగా వస్తాయి. ముఖ్యంగా థియేటర్స్ విషయంలో ఇబ్బంది ఉంటుంది. దానికి తోడు ఒక నాలుగు సినిమాలు అంటే దాదాపు టైమ్ ను అడ్జెస్ట్ చేసుకుని ఆడియన్స్ చూస్తారు. కానీ ఏడు సినిమాలు అంటే అన్నింటికీ కచ్చితంగా న్యాయం చేయలేరు. కానీ ఏ సినిమా కూడా డ్రాప్ అయినట్లు కనిపించడం లేదు.

ఇదంతా ఒకెత్తు అయితే.. తెలంగాణలో ప్రీమియర్ షోలు, టికెట్ రేట్ల పెంపు కోసం అనుమతులు ఇస్తారో లేదో అన్నది ఇప్పుడు కీలక అంశంగా మారింది. ఎందుకంటే ఇటీవల ఆ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇకపై బెనిఫిట్ షోలు, టికెట్ పెంపు ఉండవని, తమకు ఎవరూ రిక్వెస్ట్ ఆ విషయంలో చేయొద్దని చెప్పారు.

ఆ తర్వాత సంక్రాంతి నిర్మాతలేమో ఇటీవల ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తామని చెప్పారు. అప్పుడు ప్రభుత్వం చెప్పే దాని బట్టి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. సంక్రాంతి విషయంలో మినహాయింపు ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ అనుమతులు ఇచ్చాక.. కోర్టు నుంచి అడ్డంకులు ఎదురైనా దానికి కూడా ప్రత్యామ్నాయంగా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

అదే సమయంలో అఖండ 2 తాండవం మూవీ టికెట్ రేట్స్ హైక్స్ వ్యవహారం ఇప్పుడు హైకోర్టులో నడుస్తున్న సంగతి తెలిసిందే. మరో 10 రోజుల్లో హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. దీంతో అప్పుడు దాని బట్టి నిర్ణయం తీసుకోవచ్చనే ఆలోచనలో సంక్రాంతి చిత్రాల నిర్మాతలు ఉన్నారని సమాచారం. ఏదేమైనా తెలంగాణలో రేట్ల హైక్స్ విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో నిర్మాతలు ఫుల్ కన్ఫ్యూజ్ లో ఉన్నారనే చెప్పాలి.

Tags:    

Similar News