సూర్య విషయంలో వెంకీ దూకుడు..!
ఈ సినిమాలో సూర్య సరసన మమితా బైజు హీరోయిన్ గా నటిస్తుంది. మే లో సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నారని తెలుస్తుంది.;
కోలీవుడ్ స్టార్ సూర్య తెలుగు డైరెక్టర్ తో సినిమా చేయాలని చాలా ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు. ఐతే త్రివిక్రమ్, బోయపాటి లాంటి డైరెక్టర్స్ తో సూర్య చేయాలని ప్రయత్నించారు. అంతెందుకు మగధీర సినిమా కోసం రాజమౌళి ముందు సూర్యతో చేయాలని అనుకోగా ఆయన అప్పుడు కాదన్నాడు. ఆ తర్వాత చాలాసార్లు ఆ సినిమా చేయనందుకు సూర్య బాధపడ్డాడు. ఫైనల్ గా సూర్య తెలుగు టాలెంటెడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో కలిసి సినిమా చేస్తున్నాడు.
సూర్యతో మరో డిఫరెంట్ సినిమాతో..
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మే నెలల్లో మొదలైంది. సార్, లక్కీ భాస్కర్ సినిమాలతో తన టాలెంట్ చూపించిన వెంకీ అట్లూరి ఈసారి సూర్యతో మరో డిఫరెంట్ సినిమాతో రాబోతున్నారని తెలుస్తుంది. ఈ సినిమాలో సూర్య సరసన మమితా బైజు హీరోయిన్ గా నటిస్తుంది. మే లో సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నారని తెలుస్తుంది.
సూర్య 46 షూటింగ్ పూర్తైందని చిత్ర యూనిట్ ప్రకటించింది. వెంకీ అట్లూరి కేవలం ఆరు నెలల్లోనే షూటింగ్ పూర్తి చేశాడు. సినిమాను 2026 సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. సూర్య తెలుగు, తమిళ్ భాషల్లో బైలింగ్వెల్ మూవీగా ఇది చేస్తున్నారు. లక్కీ భాస్కర్ హిట్ తో వెంకీ సినిమాల మీద హైప్ పెరిగింది. అంతేకాదు సూర్యతో వెంకీ అనగానే మూవీపై ఇన్ స్టంట్ బజ్ క్రియేట్ అయ్యింది.
లక్కీ భాస్కర్ తరహాలోనే వెంకీ అట్లూరి..
కొన్నాళ్లుగా కమర్షియల్ సక్సెస్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నాడు సూర్య. కంగువ, రెట్రో లాంటి సినిమాలు చేసినా కూడా అవి సాటిస్ఫై చేయలేదు. ప్రస్తుతం సూర్య చేసిన కరుప్పు సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. నెక్స్ట్ వెంకీ అట్లూరి సినిమా కూడా సూపర్ హైప్ తో రాబోతుంది. ఈ రెండు సినిమాలతో ఫ్యాన్స్ కి ఫీస్ట్ అందించాలని చూస్తున్నారు సూర్య. సార్, లక్కీ భాస్కర్ తరహాలోనే వెంకీ అట్లూరి సూర్యతో చేస్తున్న సినిమాకు కూడా పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ ని వాడుకుంటున్నాడని తెలుస్తుంది. సూర్యలోని వర్సటాలిటీని ఈ సినిమా కోసం ఫుల్లుగా వాడేస్తున్నారని తెలుస్తుంది. వెంకీ మీద సూర్య కూడా పూర్తి నమ్మకం ఉంచి పనిచేస్తున్నారు. ఐతే సినిమాను అనుకున్నది అనుకున్నట్టుగా పూర్తి చేయడంలో వెంకీ సక్సెస్ అయ్యాడు.
6 నెలల్లో స్టార్ సినిమా పూర్తి చేయడం వల్ల నిర్మాతలకు కూడా బడ్జెట్ విషయంలో కోపరేట్ చెసినట్టు అవుతుంది. వెంకీ చేస్తున్న ఈ అటెంప్ట్ కు ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. సూర్య నుంచి ఒక మంచి సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి స్టార్ హీరో చేస్తున్న ఈ ప్రయత్నాలు మెప్పించేలా చేస్తాయా లేదా అన్నది చూడాలి.