ఈ వారం రిలీజులివే!
ఇవి కాకుండా మరికొన్ని ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. మరి ఏ ఓటీటీలో ఏమేం రిలీజవుతున్నాయో చూద్దాం.;
మరో వారం వచ్చేసింది. ప్రతీ వారం లాగానే ఈ వారం కూడా కొన్ని కొత్త సినిమాలు థియేటర్లలో సందడి చేయడానికి రెడీ అవుతుండగా, మరికొన్ని సినిమాలు, వెబ్‌సిరీస్, కొత్త కంటెంట్ ఓటీటీలో రిలీజ్ కు రెడీ అవుతుంది. అయితే ఈ వారం బాక్సాఫీస్ వద్ద పెద్దగా చెప్పుకోదగ్గ రిలీజులేమీ లేవు. నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా నటించిన గుర్రం పాపి రెడ్డి డిసెంబర్ 19న రిలీజ్ కానుంది. దాంతో పాటూ అదే రోజున రామ్ కిరణ్, మేఘా ఆకాష్ జంటగా నటించిన సఃకుటుంబానాం రిలీజవుతోంది. అవతార్ ఫైర్ అండ్ యాష్ కూడా డిసెంబర్ 19 నాడే ప్రేక్షకుల ముందుకు రానుంది. వాటితో పాటూ మిస్టీరియస్ కూడా డిసెంబర్ నాడే రిలీజవుతుంది. ఇవి కాకుండా మరికొన్ని ఓటీటీలో రిలీజ్ కానున్నాయి. మరి ఏ ఓటీటీలో ఏమేం రిలీజవుతున్నాయో చూద్దాం.
నెట్‌ఫ్లిక్స్‌లో..
ప్రేమంటే అనే తెలుగు మూవీ
రాత్ అఖేలీ హై అనే హిందీ మూవీ
ఎమిలీ ఇన్ పారిస్ అనే వెబ్‌సిరీస్ సీజన్5
ప్రైమ్ వీడియోలో..
థామా అనే బాలీవుడ్ మూవీ
ఏక్ దివానే కీ దివానీయత్ అనే హిందీ మూవీ
ఫాలౌట్ అనే వెబ్‌సిరీస్
ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ అనే వెబ్‌సిరీస్
జియో హాట్‌స్టార్‌లో..
మిసెస్ దేశ్ పాండే అనే హిందీ వెబ్ సిరీస్
జీ5లో..
నయనం అనే తెలుగు వెబ్‌సిరీస్
డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్ అనే మలయాళ మూవీ
సన్‌నెక్ట్స్‌లో..
దివ్య దృష్టి అనే తెలుగు మూవీ
ఈటీవీ విన్‌లో..
రాజు వెడ్స్ రాంబాయి అనే తెలుగు సినిమా