బ‌న్నీ ఆ విష‌యంలో జాగ్ర‌త్త పాడాల్సిందే?

ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతోంది. దీనితో పాటు త‌న 23వ ప్రాజెక్ట్‌ని లోకేష్ క‌న‌గ‌రాజ్‌తో బ‌న్నీ చేస్తున్న విష‌యం తెలిసిందే.;

Update: 2026-03-16 14:30 GMT

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో వ‌చ్చిన భారీ మార్పుల గురించి ప్ర‌స్థావ‌న వ‌చ్చిన‌ప్పుడు `బాహుబ‌లి`కి ముందు బాహుబ‌లి` త‌రువాత అని చెబుతుంటారు. బ‌న్నీ గురించి మాట్లాడినా `పుష్ప‌`కు ముందు, త‌రువాత అని చెప్ప‌క త‌ప్ప‌దు. `పుష్ప‌`తో బ‌న్నీ పాన్ ఇండియా స్టార్‌గా మార‌డం తెలిసిందే. ఇక్క‌డి నుంచే ఆయ‌న‌లో విప్ల‌వాత్మ‌క మార్పులు చోటు చేసుకుంటున్నాయి. `పుష్ప 2`తో సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త‌న త‌దుప‌రి సినిమాల‌ని అంత‌కు మించి అన్న‌ట్టుగా ప్లాన్ చేసుకుంటూ అంద‌రిని ఆశ్చర్య‌ప‌రుస్తున్నారు.

ప్ర‌స్తుతం రెండు క్రేజీ ప్రాజెక్ట‌లని లైన్‌లో పెట్టి య‌మ స్పీడుతో సాగిపోతున్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ అట్లీతో చేస్తున్న సూప‌ర్ హీరో మూవీని స‌న్ పిక్చ‌ర్స్ వారు అత్యంత భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దీపిక ప‌దుకునే కీల‌క పాత్ర‌లో యోధురాలిగా న‌టిస్తోంది. మిగ‌తా కీల‌క క్యారెక్ట‌ర్ల‌లో ర‌ష్మిక మంద‌న్న‌,మృణాల్ ఠాకూర్ కూడా న‌టిస్తున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నా దీనిపై ఇంత వ‌ర‌కు టీమ్ నుంచి ఎలాంటి ప్ర‌క‌ట‌న రాలేదు. యోగిబాబు కూడా ఓ క్యారెక్టర్ చేస్తున్నాడు.

ప్ర‌స్తుతం దీనికి సంబంధించిన షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతోంది. దీనితో పాటు త‌న 23వ ప్రాజెక్ట్‌ని లోకేష్ క‌న‌గ‌రాజ్‌తో బ‌న్నీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన అనౌన్స్‌మెంట్ వీడియో సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. దీనితో పాటు బ‌న్నీ మ‌ల‌యాళ న‌టుడు, ద‌ర్శ‌కుడు బ‌సిల్ జోసెఫ్ డైరెక్ష‌న్‌లోనూ ఓ సూప‌ర్ హీరో సినిమాకు రెడీ అవుతున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న త్వ‌ర‌లోనే రానుంది. ఇదిలా ఉంటే మునుపెన్న‌డూ లేనంత‌గా బ‌న్నీ ప‌బ్లిక్‌లో ఎక్కువ‌గా క‌నిపిస్తుండ‌టంత అంద‌రిని క‌ల‌వ‌రానికి గురి చేస్తోంది.

గ‌తంలో ఇలా క‌నిపించ‌కుండా ప్రైవ‌సీని మెయింటైన్ చేసిన బ‌న్నీ ఇలా ఉన్న‌ట్టుండి ప‌బ్లిక్‌లో ఎక్కువ‌గా క‌నిపిస్తుండ‌టం, ఏయిర్ పోర్ట్‌ల‌లో ప్ర‌ధానంగా క‌నిపిస్తుండ‌టంతో ప‌బ్లిక్ ఫొటోల కోసం ఎగ‌బ‌డుతున్నారు. దీంతో సోష‌ల్ మీడియాలో బ‌న్నీకి సంబంధించిన వీడియోలు వారానికి ఒక‌టి రెండు ద‌ర్శ‌నమిస్తు ఉన్నాయి. దీంతో నెట్టింట ఓ చ‌ర్చ మొద‌లైంది. సోష‌ల్ మీడియా ప్ర‌భావం ప్రారంభ‌మైనా కూడా సెల‌బ్రిటీలు ఆడియ‌న్స్‌తో కానీ, అభిమానుల‌తో కానీ పెద్ద‌గా ఇంట‌రాక్ట్ అయిన సంద‌ర్భాలు లేవు. కార‌ణం ఎంత దూరంగా ఉంటే అంత ప్రైవ‌సీ ఉంటుందని.

కానీ ఇప్పుడు ఆ హ‌ద్దులు చెరిగిపోయాయి. నిత్యం స్టార్స్‌తో స‌గ‌టు ప్రేక్ష‌కుడు సోష‌ల్ మీడియా వేదిక‌గా ట‌చ్‌లో ఉంటున్నాడు. స్టార్స్ కూడా ఆడియ‌న్స్ ట్వీట్‌ల‌కు రిప్లైలు ఇవ్వ‌డ‌మే కాకుండా క‌నిపించిన‌ప్పుడు ఫొటోల‌కు పోజులు ఇస్తేఉండ‌టంతో స్టార్స్‌పై క్ర‌మ క్ర‌మంగా క్రేజ్ త‌గ్గిపోయే ప్ర‌మాదం ఉంద‌నే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. ఈ విష‌యంలో ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోకుండా బ‌న్నీ నిత్యం అభిమానుల‌కు ఏయిర్ పోర్ట్‌లలో క‌నిపిస్తూ ఫోటోల‌కు, వీడియోల‌కు ఫోజులిస్తున్నారు.

ఇదే ఇప్పుడు అంద‌రిని క‌ల‌వ‌రానికి గురి చేస్తోంది. గ‌తంలో స్టార్స్ ఎంత త‌క్కువ‌గా క‌నిపిస్తే అంత క్రేజ్ అని ప్రైవ‌సీని మెయింటైన్ చేసేవారు. కానీ సోష‌ల్ మీడియా ప్ర‌భావం కార‌ణంగా అది క‌నిపించ‌డం లేదు. దీంతో నిత్యం క‌నిపించే స్టార్స్‌పై ప్రేక్ష‌కుల్లో క్రేజ్ త‌గ్గే ప్ర‌మాదం ఉంద‌ని, ఈ విష‌యంలో బ‌న్నీ జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ మ‌రింత‌గా ప్రైవ‌సీని మెయింటైన్ చేయాల‌ని అభిమానులు, సినీ ల‌వ‌ర్స్ కోరుకుంటున్నారు.

Tags:    

Similar News