మార్చి పోరులో ఎవరు తగ్గట్లేదు..!

ఐతే మార్చి మంత్ ఎండ్ అంటే 26, 27 తేదీల్లో రెండు భారీ సినిమాలు రాబోతున్నాయి. రెండు సినిమాలు రెండు డిఫరెంట్ అటెంప్ట్ గా వస్తున్నాయి.;

Update: 2025-12-15 06:41 GMT

నెక్స్ట్ సంక్రాంతికి సినిమాల ఫైట్ ఒక రేంజ్ లో ఉండబోతుంది. తెలుగు సినిమాలే ఐదు రేసులో ఉన్నాయి. వాటితో పాటు రెండు తమిళ డబ్బింగ్ సినిమాలు కూడా పోటీకి వచ్చేలా ఉన్నాయి. సంక్రాంతి తర్వాత మళ్లీ మార్చి నెలలో సినిమాల మధ్య బిగ్ క్లాష్ ఏర్పడేలా ఉంది. మార్చి రెండో వారం నుంచి సినిమాల సందడి షురూ కాబోతుంది. ఐతే మార్చి మంత్ ఎండ్ అంటే 26, 27 తేదీల్లో రెండు భారీ సినిమాలు రాబోతున్నాయి. రెండు సినిమాలు రెండు డిఫరెంట్ అటెంప్ట్ గా వస్తున్నాయి.

నాని ది ప్యారడైజ్ తో మరో లెవెల్..

మార్చి 26, 2026 న న్యాచురల్ స్టార్ నాని ది ప్యారడైజ్ సినిమా వస్తుంది. ఈ సినిమాను శ్రీకాంత్ ఓదెల డైరెక్ట్ చేస్తున్నాడు. దసరాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న ఈ డైరెక్టర్ ది ప్యారడైజ్ తో మరో లెవెల్ అనిపించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో నాని జడల్ రోల్ లో డిఫరెంట్ గా కనిపించబోతున్నాడు. సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు విలన్ గా నటించడం కూడా సినిమాపై సూపర్ హైప్ తెచ్చింది.

నాని ది ప్యారడైజ్ సినిమా విషయంలో ఎక్కడ తగ్గట్లేదు. ఈ సినిమాను తెలుగుతో పాటు 7 భాషల్లో రిలీజ్ ప్లాన్ చేశారు. ఐతే మార్చి 27న గ్లోబల్ స్టార్ రాం చరణ్ పెద్ది సినిమా వస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. పెద్ది కి ఏ.ఆర్ రెహమాన్ మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్ కాబోతుంది. నాని ది ప్యారడైజ్, రాం చరణ్ పెద్ది ఈ రెండు సినిమాల మధ్య ఒక రసవత్తరమైన ఫైట్ జరగబోతుంది. ఈ రెండు సినిమాల్లో ఏదైనా వెనక్కి తగ్గి సమ్మర్ కి షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉందేమో అని నిన్నటిదాకా అనుకోగా రెండు సినిమాల్లో ఏది వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నట్టుగా పరిస్థితి కనిపిస్తుంది. అందుకే మార్చి ఎండింగ్ లో పెద్ది, ప్యారడైజ్ మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగబోతుంది.

పీరియాడికల్ కథతో పెద్ది..

నాని సినిమా కంప్లీట్ న్యూ వరల్డ్ తో రాబోతుందని తెలుస్తుంది. పెద్ది కూడా పీరియాడికల్ కథతో వస్తుంది. ఈ రెండు సినిమాలు కూడా మార్చి మంత్ ఎండ్ కి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. రెండిటిలో ఎవరు కూడా తమ రిలీజ్ డేట్ మార్చే ఆలోచనలో లేరు. సో నానితో చరణ్ ఫైట్ పక్కా అన్నట్టే ఉంది. దసరాతో శ్రీకాంత్, ఉప్పెనతో బుచ్చి బాబు ఇద్దరు కూడా తొలి సినిమా సంచలన విజయాన్ని అందుకున్నారు. సో ఈ ఇద్దరు తన ద్వితీయ విఘ్నం ఎలా దాటతారు అన్నది చూడాలి.

పెద్ది సినిమా నుంచి ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇప్పటికే సాంగ్ రిలీజై ట్రెండింగ్ లో ఉంది. నాని ది ప్యారడైజ్ నుంచి నాని లుక్ తో పాటు మోహన్ బాబు లుక్ రిలీజ్ చేశారు. ది ప్యారడైజ్ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Tags:    

Similar News