• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  షాకిచ్చే మేకోవ‌ర్ తో...

షాకిచ్చే మేకోవ‌ర్ తో చాక్లెట్ బోయ్ సిద్ధార్థ్

By - Tupaki Desk
Update: 2020-12-09 14:29 GMT
శంక‌ర్ `బాయ్స్‌` మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సిద్ధార్ధ్ ఆ త‌రువాత టాలీవుడ్ ‌లో హాట్ త్రోబ్ ‌గా.., ల‌వ‌ర్ బాయ్ ‌గా మంచి క్రేజ్ ‌ని సొంతం చేసుకున్నారు. `బొమ్మ‌రిల్లు` టాలీవుడ్ ‌లో ఏ స్థాయి సంచ‌నం సృష్టించిందో అంద‌రికి తెలిసిందే. జ‌బ‌ర్ద‌స్త్ -, బాద్ షా వంటి చిత్రాల త‌రువాత సిద్ధార్ధ్ టాలీవుడ్ కు టాటా చెప్పేశారు. కొన్ని వ్య‌క్తిగ‌త‌ కార‌ణాల వ‌ల్ల టాలీవుడ్ కు సిద్ధార్ధ్ దూర‌మై దాదాపు ఎనిమిదేళ్ల‌వుతోంది.

ఈ ఎనిమిదేళ్ల విరామం త‌రువాత సిద్ధార్ధ్ టాలీవుడ్ ‌లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. శ‌ర్వానంద్ హీరోగా అజ‌య్ భూప‌తి రూపొందిస్తున్న‌ భారీ మ‌ల్టీస్టార‌ర్‌ చిత్రం `మ‌హాస‌ముద్రం` లో న‌టిస్తూ హాట్ టాపిక్ గా మారాడు. ఈ మూవీతో సిద్ధార్థ్ టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తుండ‌డం అభిమానుల్లో చ‌ర్చ‌కు వ‌చ్చింది.

గ‌త ఎనిమిదేళ్ల క్రితం ఫేడ‌వుట్ అయిపోయిన సిద్ధార్థ్ ఒక ద‌శ‌లో టాలీవుడ్ ‌లో అగ్ర క‌థానాయ‌కుడిగా ఓ వెలుగు వెలిగాడు. టాలీవుడ్ హీరోలంద‌రి మెప్పుని పొంద‌డ‌మే కాకుండా మెగా హీరోలు కూడా మెచ్చిన స్టార్ గా సిద్ధార్థ్ పేరు మార్మోగింది.

అనూహ్యంగా ఉవ్వెత్తున ఎగిసిన తారా జువ్వ‌లా సంచ‌ల‌నం సృష్టించారు. కానీ ఆ త‌రువాత జ‌రిగిన నాట‌కీయ ప‌రిణామాల కార‌ణంగా కెరీర్ ప‌రంగా నేల‌కు జారిపోయాడు. అయితేనేం `మ‌హాస‌ముద్రం`తో తిరిగి స‌త్తా చాటేందుకు వ‌స్తున్నాడు. ఒక ర‌కంగా చెప్పాలంటే తారా తీరం నుంచి ఉల్క‌లా దూసుకొస్తున్నాడు. గ‌తంతో పోలిస్తే లుక్ వైజ్ గా చాలా మారిపోయిన సిద్ధార్థ్ మ‌ళ్లీ మెస్మ‌రైజ్ చేస్తాడో లేదో తెలియాలంటే `మ‌హా స‌ముద్రం` రిలీజ్ వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

మ‌హాస‌ముద్రంలో అదితీరావు హైద‌రీ.. అను ఇమ్మాన్య‌యేల్ హీరోయిన్‌లుగా న‌టిస్తున్నారు. ఏకే ఎంటర్ ‌టైన్ ‌మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.




Tags:    
  • Movie News 
  • Tollywood News 
  • Bollywood News 
  • Kollywood 
  • Movie Updates 

Similar News

"లైఫ్ టైం లవ్ " అంటూ పోస్ట్. గ్రీస్ అందాల మధ్య అనిరుధ్ -కావ్య దంపతులు!

2026-11-12 04:04 GMT

అనీష్ తొలి సినిమా.. రెండేళ్లకు పైగా ప్లానింగ్!

2026-11-12 04:01 GMT

రెండో ఫ్రెగ్నెన్సీ గ్లో.. కియ‌రా స్ట‌న్నింగ్ ఫోటోషూట్!

2026-11-12 03:58 GMT

తొలి సినిమాకే మాటలు లేని పాత్ర.. అనీష్ ఎంత కష్టపడ్డారంటే!

2026-11-12 03:49 GMT

వివాహం తర్వాత తొలి పోస్ట్ పంచుకున్న ప్రియా భవాని శంకర్.. జీవితంలో మరువలేని రోజంటూ!

2026-11-12 03:36 GMT

సైలెంట్ గా అర్ధరాత్రి ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసిన సూపర్ స్టార్ మూవీ!

2026-11-12 03:31 GMT

Bigg Boss Telugu 10: హౌస్‌లో శివ - ప్రియాంక జైన్ గ్రాండ్ ఎంగేజ్‌మెంట్!

2026-11-12 03:25 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ కి బూస్ట్ ఇచ్చే ఎపిసోడ్ పడింది కదా!

2026-11-12 03:23 GMT

N-క‌న్వెన్ష‌న్‌ని కూల్చివేసినా కానీ కింగ్ నాగార్జున ఏంటి ఇలా?!

2026-11-12 02:25 GMT

అనిరుధ్ పెళ్లిలో స్టెప్పులు.. ఏజ్‌లెస్ హీరోకి కిక్కు ఎక్కెరా!

2026-11-12 02:16 GMT

అందాల ఆమ‌ని స్టార్ హీరోల‌కు దూరంగా!

2026-11-11 22:30 GMT

డేట్ నైట్స్ సీక్రెట్స్ బయటపెట్టిన కియారా-సిద్ధార్థ్!

2026-11-11 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS