• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అనిరుధ్ పెళ్లిలో...

అనిరుధ్ పెళ్లిలో స్టెప్పులు.. ఏజ్‌లెస్ హీరోకి కిక్కు ఎక్కెరా!

| సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ వివాహం గ్రీస్‌లో నవంబర్ 11న జరిగింది. ఈ వేడుకకు హాజరైన రజినీకాంత్.. ‘వెట్టైయాన్’ సినిమాలోని ‘మనసెలాయో’ పాటకు నూతన దంపతులతో కలిసి హుక్ స్టెప్స్ వేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నవంబర్ 21న చెన్నైలో రిసెప్షన్ జరగనుంది.

By - Sivaji Kontham
Update: 2026-11-12 02:16 GMT

సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్- సన్ గ్రూప్ వారసురాలు కావ్య మారన్ వివాహ వేడుక గ్రీస్‌లో అత్యంత వైభవంగా జరిగింది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ వేడుక నవంబర్ 10న సాంప్రదాయ నిశ్చితార్థంతో మొద‌ల‌వ‌గా.. నవంబర్ 11న వివాహ వేడుక వైభ‌వంగా జ‌రిగింది.

ఈ వివాహ వేడుకకు సూపర్‌స్టార్ రజినీకాంత్ తన సతీమణి లతాతో కలిసి హాజ‌ర‌య్యారు. స‌తీమ‌ణి మేనల్లుడి వివాహం కావడంతో రజినీకాంత్ ప్రతి క్షణాన్ని ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా గడిపారు. కుటుంబ వేడుకలో ఆయన సందడి చేయడం అక్కడ ఉన్నవారందరిలోనూ ప్రత్యేక ఉత్సాహాన్ని నింపింది.

ఈ వేడుకల్లో భాగంగా అనిరుధ్ సంగీత దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన `వెట్టైయాన్` చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ `మనసెలాయో` పాటకు రజినీకాంత్ వేసిన హుక్ స్టెప్స్ హైలైట్‌గా నిలిచాయి. నూతన దంపతులతో కలిసి ఆయన ఈ పాటకు చిందులు వేయగా.. ఆ విజువల్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యి అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ వ‌య‌సులోను ఏజ్ లెస్ హీరోకి కిక్కు ఎక్కెరా! (న‌ర‌సింహా సినిమాలో ని పాట‌ను) అంటూ నెటిజ‌నులు స‌ర‌దాగా వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ వేడుకకు కేవలం కుటుంబ సభ్యులే కాకుండా పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ తదితరులు ప్రత్యేక అతిథులుగా విచ్చేసి నూతన దంపతులను ఆశీర్వదించారు. రాజకీయ, సినీ ప్రముఖుల రాకతో ఈ వేడుక మరింత ఘనంగా మారింది.

ఇక ఈ పెళ్లి వేడుకల్లో నూతన దంపతులు అనిరుధ్- కావ్య మారన్ ధరించిన డిజైనర్ దుస్తులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్రీస్ వేదికగా అంగరంగ వైభవంగా ముగిసిన ఈ వేడుకల అనంతరం.. నవంబర్ 21న చెన్నైలో అత్యంత గ్రాండ్‌గా రిసెప్షన్ జరగనుంది. ఈ రిసెప్ష‌న్‌కి టాలీవుడ్ స‌హా దేశ‌వ్యాప్తంగా ఉన్న‌ సినీప‌రిశ్ర‌మ‌ల‌కు చెందిన ప్ర‌ముఖులు హాజ‌ర‌వుతున్నారని స‌మాచారం.



Superstar #Rajinikanth steals the show with his dance moves at #Anirudh & #KavyaMaran’s wedding! 🔥❤️🕺 #AnirudhKavyaWedding #AnirudhRavichander https://t.co/DTD83FVXjq

— Vasanth Raj (@vasanthraj001) November 11, 2026


Tags:    
  • anirudh 
  • kavyamaran 
  • rajinikanth 
  • manasilaayo 
  • anirudhwedding 

Similar News

'సెల్ఫ్ రెస్పెక్ట్ ' పద్ధతిలో కావ్య- అనిరుధ్ పెళ్లి.. ఈ పద్ధతి ఎప్పుడు? ఎక్కడ? ఎలా ఆవిర్భవించిందంటే?

2026-11-13 10:27 GMT

రామాయణంలో అతనికి మాత్రమే భారీ ప్రశంసలు!

2026-11-13 10:26 GMT

పిల్లల కోసం టికెట్ రేట్లు తగ్గించారు

2026-11-13 10:24 GMT

అక్క‌డాయ‌న అందుకే మెగాస్టార్ అయ్యారు!

2026-11-13 10:19 GMT

ట్రైల‌ర్ టాక్: 'తుంబాడ్' స్టైల్ మేకింగ్ ఆర్ట్‌వ‌ర్క్‌తో ద‌డ పుట్టిస్తోంది!

2026-11-13 10:18 GMT

కీరవాణి అంకితభావంపై అనుపమ్ ఖేర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!

2026-11-13 08:34 GMT

నాగశౌర్యతో విభేదాలపై స్పందించిన వెంకీ కుడుముల..!

2026-11-13 08:33 GMT

'జంగా' గ్లింప్స్: నోట్లో మందు బాటిల్.. శ్మశానంలో చితి మంటలు

2026-11-13 08:31 GMT

తెరపై సౌమ్యుడు..తెర వెనుక అల్లరి పిల్లాడు!

2026-11-13 08:30 GMT

రణబీర్, యష్‌ల రామాయణకు గౌతమ్ ఘట్టమనేని రేటింగ్.. ఎంత ఇచ్చాడంటే!

2026-11-13 07:16 GMT

తెలుగు ఆడియన్స్ పల్స్ పట్టేసిన దుల్కర్.. మిగతా హీరోలు నేర్చుకోవాల్సింది ఇదే!

2026-11-13 07:08 GMT

రాజమౌళి సక్సెస్ కి శంకర్ ఫెయిల్యూర్ కి కారణం ఇదే...

2026-11-13 07:07 GMT

Copyright @2026

Powered by Blink CMS