బాస్ ఏంటి గుర్తు ప‌ట్టకూడ‌ద‌నా? ప‌ట్టేశాంగా!!

Update: 2019-07-06 05:24 GMT
ఎంత దాచేయాల‌నుకున్నా బాస్ ని దాచ‌గ‌ల‌రా? అలాంటి స‌న్నివేశ‌మే ఎదురైంది శంషాబాద్ విమానాశ్ర‌యంలో. బాస్ పూర్తిగా గెట‌ప్ మార్చారు. త‌న‌ని ఎవ‌రూ గుర్తు ప‌ట్ట‌కూడ‌ద‌ని అనుకున్నారో ఏమో..  చాలా సింపుల్ గా క్యాజువ‌ల్ డ్రెస్ లో దిగిపోయారు. బ్లాక్ పోలో టీస్.. కాంబినేష‌న్ డెనిమ్ జీన్స్.. స‌న్ గ్లాసెస్.. పైగా బేస్ బాల్ ప్లేయ‌ర్ లా ఆ స్పోర్ట్స్ క్యాప్ తో పూర్తిగా అవ‌తారమే మారిపోయింది. అయినంత మాత్రాన గుర్తు ప‌ట్ట‌లేరా?

బాస్ ఎక్క‌డున్నా ఇట్టే గుర్తు ప‌ట్టేసే ఫ్యాన్స్ ఉంటారు క‌దా! అలా దొరికిపోయారు. అయితే మారిన గెట‌ప్ మాత్రం పూర్తిగా గ్యాంగ్ లీడ‌ర్ స్టైల్లో అభిమానుల్ని అల‌రించింది. బాస్ ఏజ్ కూడా పాతికేళ్లు వెన‌క్కి వెళ్లిపోయిందంటే అతిశ‌యోక్తి కాదు. ఈ గెట‌ప్ లో చిరు 60-20 ఏజ్ అంటే 40ల‌లోకి వెళ్లిపోయార‌నే చెప్పాలి. మొత్తానికి బాస్ గెట‌ప్ అదిరిపోయింది. అస‌లు ఎందుకిలా వేష‌ధార‌ణ మార్చారు బాస్? అంటే .. ఇదంతా కొర‌టాల శివ‌తో సినిమా కోస‌మేనా? అంటూ ఒక‌టే సందిగ్ధ‌త నెల‌కొంది. మెగాస్టార్ చిరంజీవి న‌టించిన సైరా న‌ర‌సింహారెడ్డి అక్టోబ‌ర్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఆ త‌ర్వాత కింక‌ర్త‌వ్యం ఏమిటి? అన్న‌దే టాస్క్.

ఏడాదిగా వేచి చూస్తున్న‌ కొర‌టాల‌తో మూవీ కోసమేనా ఇదంతా?  దానిపైనేనా బాస్ ఈ క‌స‌ర‌త్తు? ఇలా గ్యాంగ్ లీడ‌ర్ గెట‌ప్ కి మారిపోవ‌డానికి కార‌ణ‌మేంటి? ఇంత‌కీ శంషా బాద్ విమానాశ్రయం నుంచి ఎక్క‌డికి వెళుతున్న‌ట్టు? ఈసారి టూర్ ఎక్క‌డి వ‌రకూ? ఈ ప్ర‌శ్న‌ల‌న్నిటికీ ఆన్స‌ర్ డీకోడ్ చేయాల్సిందే. నిన్న‌నే సాహో చిత్రీక‌ర‌ణ ముగించిన ప్ర‌భాస్ ఇలా ఎయిర్ పోర్ట్ లో చిక్కారు. నేడు సైరా స్టార్ చిరంజీవి కూడా ఇలానే ఎక్క‌డికో వెళుతూ చిక్కారు. ఇక త‌దుప‌రి ప్రాజెక్టు గురించి ప‌రిశీలిస్తే.. ఈసారి మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకుని కొర‌టాల పూర్తిగా సోష‌ల్ మెసేజ్ ఉన్న క‌మ‌ర్షియ‌ల్ పాయింట్ తో సినిమాని తీసేందుకు రెడీ అవుతున్నార‌ని తెలుస్తోంది. న‌య‌న‌తార‌ను ఇప్ప‌టికే క‌థానాయిక‌గానూ ఫైన‌ల్ చేశార‌ని వార్త‌లొచ్చాయి.

    
    
    

Tags:    

Similar News