కాజ‌ల్‌ ది అరుదైన రికార్డన్న చిరు

Update: 2017-01-07 05:17 GMT
చిరు 150వ సినిమాకి కొబ్బ‌రికాయ కొట్ట‌గానే అందులో న‌టించే హీరోయిన్ ఎవ‌రా అని అంతా ఆస‌క్తిగా చూశారు. ప‌లువురు క‌థానాయిక‌ల పేర్లు వినిపించిన‌ప్ప‌టికీ  అటు తిరిగి ఇటు తిరిగి చివ‌రికి కాజ‌ల్‌ కే ఆ అవ‌కాశం ద‌క్కింది. చిరు కెరీర్‌ లో ఓ మైలురాయిలాంటి సినిమాలో కాజ‌ల్ క‌థానాయిక‌గా న‌టించ‌డం నిజంగా ఆమె అదృష్ట‌మ‌నే చెప్పాలి. ఆమె కూడా వేరే సినిమాల్ని కాద‌ని మ‌రీ, చిరు సినిమా చేయ‌డానికి గ్రీన్‌ సిగ్న‌ల్ ఇచ్చేసింది. ఇప్పుడు కాజ‌ల్‌ - చిరుల‌ని పోస్ట‌ర్ల‌లో చూసి  `జోడీ బాగా కుదిరింది` అంటున్నారంతా. అయితే మొద‌ట్లో మాత్రం కాజ‌ల్ ఎంపిక‌పై కొన్ని భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మయ్యాయి. చిరు అబ్బాయి చ‌ర‌ణ్ స‌ర‌స‌న న‌టించిన హీరోయిన్ - ఇప్పుడు తండ్రితోనా? ఏం బావుంటుందీ? అన్నారంతా. కానీ ఆ మాటల్ని ఇటు  చ‌ర‌ణ్‌ కానీ - అటు చిరు కానీ అస్స‌లు ప‌ట్టించుకోకుండా సినిమా చేసేశారు. కాజ‌ల్ ఎంపిక గురించి చిరు ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడారు.

``కాజ‌ల్‌ ది ఓ అరుదైన రికార్డు. మామూలుగా మ‌న ఇండ‌స్ట్రీలో  హీరోయిన్లు తండ్రితో క‌లిసి న‌టించాక  త‌న‌యుడితో తెర‌ను పంచుకుంటారు. కానీ కాజ‌ల్ మాత్రం మొద‌ట నా  త‌న‌యుడితో న‌టించింది. ఆ త‌ర్వాత నాతో న‌టించింది`` అన్నాడు. తొలి రోజు త‌న డ్యాన్స్‌ ని చూసి కాజ‌ల్ ఆశ్చ‌ర్య‌పోయింద‌ని చెప్పుకొచ్చాడు చిరు. ``సినిమాల‌కి దూర‌మైన తొమ్మిదేళ్ల కాలంలో స‌ర‌దాకి కూడా నేను డ్యాన్స్ చేసింది లేదు. నా కూతురు పెళ్లిలో పిల్ల‌లు బ‌ల‌వంతం చేయ‌డంతో కొన్ని సెక‌న్ల‌పాటు డ్యాన్స్ వేశా. అలాంటి ఈ సినిమాలో డ్యాన్స్ కంపోజ్ చేయ‌గానే వెళ్లి అల‌వోక‌గా స్టెప్పులేశాను. అది చూసి కాజ‌ల్ ఆశ్చ‌ర్య‌పోయింది`` అన్నాడు చిరు. 


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News