చరణ్ కూడా బ్రేక్‌ తీసుకబోతున్నాడు

Update: 2020-11-23 07:10 GMT
సెల్రబెటీలు రెండు మూడు నెలలకు ఒక సారి అయినా హాలీడేస్ కు వెళ్తూ ఉంటారు. అయితే కరోనా కారణంగా ఆరు ఏడు నెలల పాటు ఎక్కడి వారు అక్కడే ఉండి పోయారు. ముఖ్యంగా స్టార్స్‌ అంతా కూడా ఇంటి నుండి బయటకు కదళ్లేదు. ఎట్టకేలకు మళ్లీ షూటింగ్‌ లు అంటూ బిజీ అవుతున్నారు. కొందరు హాలీడేస్‌ అంటూ దుబాయి.. మాల్దీవులకు వెళ్తున్నారు. అక్కడ కరోనా ప్రభావం తక్కువగా ఉండటం వల్ల ప్రముఖులు అక్కడకు వెళ్తున్నారు. ఇటీవలే ఎన్టీఆర్‌ తన ఫ్యామిలీతో కలిసి దుబాయి హాలీడే ట్రిప్‌ వెళ్లి వచ్చిన విషయం తెల్సిందే.

ఇప్పుడు రామ్‌ చరణ్‌ వంతు వచ్చింది. అతి త్వరలో ఉపాసనతో కలిసి దుబాయికి వెళ్లేందుకు చరణ్‌ సిద్దం అవుతున్నాడు. ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ షెడ్యూల్‌ బ్రేక్‌ ఉండటంతో ఆ బ్రేక్‌ సమయంలో దుబాయి వెళ్లి వచ్చేయాలని ప్లాన్‌ చేస్తున్నాడట. మొత్తానికి స్టార్‌ కపుల్‌ వచ్చిన చిన్న గ్యాప్‌ ను వినియోగించుకునేందుకు దగ్గర్లో ఉన్న దుబాయి ట్రిప్‌ వేస్తున్నారు. కొందరు మాల్దీవుల్లోకి వెళ్తున్నారు. ప్రస్తుతం నాగచైతన్య మరియు సమంతలు మాల్దీవుల్లో ఉన్నారు. అక్కడ చైతూ బర్త్‌ డే జరుపుకుటున్నాడు.
Tags:    

Similar News