పవర్ స్టార్ కు సినీ సెలబ్రిటీల బర్త్ డే విషెస్...!

Update: 2020-09-02 06:45 GMT
నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజుని పురష్కరించుకుని సోషల్ మీడియా వేదికగా అభిమానులు సెలబ్రేషన్స్ చేస్తున్నారు. రాజకీయాలపై ఫోకస్ పెట్టి సినిమాలకు దూరమైన పవన్ కళ్యాణ్ 'వకీల్ సాబ్' చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తుండటంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వారి ఆనందాన్ని రెట్టింపు చేస్తూ 'వకీల్ సాబ్' మోషన్ పోస్టర్.. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న #PSPK27 ప్రీ లుక్ పోస్టర్.. సురేందర్ రెడ్డి - పవన్ కళ్యాణ్ కాంబోలో రాబోతున్న మూవీ అనౌన్సమెంట్ ఇలా మూడు అప్డేట్స్ వచ్చాయి. అటు సినీ సెల‌బ్రిటీలు సైతం పవన్ కళ్యాణ్ 49వ ఏట అడుగు పెట్టిన సంద‌ర్భంగా సోషల్ మీడియా ద్వారా బ‌ర్త్‌ డే విషెస్ చెప్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు. ''తనువులు వేరైనా లక్ష్యం ఒక్కటే. మార్గాలు వేరైనా గమ్యం ఒక్కటే. తన గుండెచప్పుడు ఎప్పుడు జనమే. తన ఆశయం ఎల్లప్పుడూ జనహితమే. జనసేనానికి పుట్టినరోజు శుభాకాంక్షలు'' అని ట్వీట్ చేసారు. సూపర్ స్టార్ మహేష్ బాబు పవన్ తో కలిసి ఉన్న ఓ ఫోటోని షేర్ చేస్తూ ''హ్యాపీ బ‌ర్త్‌ డే పవన్ కళ్యాణ్.. మీ విన‌య విధేయ‌త ఎప్పుడూ మార్పును ప్రేరేపిస్తాయి. మీరు ఎల్ల‌ప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలి'' అని పేర్కొన్నాడు. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ చిన్నప్పుడు తన మామ పవన్‌ తో ఆడుకుంటూ అతని కాళ్లను పట్టుకుని కూర్చుని ఉన్న ఫోటో షేర్ చేస్తూ.. ''అప్పుడూ.. ఇప్పుడూ.. ఎప్పుడూ.. హ్యాపీ బర్త్ డే మామ'' అని ట్వీట్ చేసాడు.

ఇక అక్కినేని సమంత ట్వీట్ చేస్తూ.. ''అద్భుత‌మైన‌ ప‌వ‌న్ సర్‌కు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు. గొప్ప జ్ఞానం మ‌రింత గొప్ప బాధ్య‌త‌ల‌ను తీసుకువ‌స్తుంది. మీరు ఆయురారోగ్యాల‌తో సుఖ సంతోషాల‌తో వ‌ర్ధిల్లాల‌ని కోరుకుంటున్నా'' అని పవన్ కు బర్త్ డే విషెష్ అందించింది. అల్లు అర్జున్ ''ప‌వ‌ర్ స్టార్‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ గారు.. పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు'' అని ట్వీట్ చేశాడు. విక్టరీ వెంకటేష్ పవన్ కళ్యాణ్ తో ఉన్న పిక్ షేర్ చేసి ''అద్భుత‌మైన మ‌నిషి, నా ప్రియ‌ స్నేహితుడికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు. ఈ ఏడాదంతా నీకు ఆరోగ్యానందాలు ఉండాల‌ని మ‌న‌సారా కోరుకుంటున్నా'' అని పేర్కొన్నాడు.

మాస్ మహారాజా రవితేజ.. ''నాకు ఎంతో ఇష్ట‌మైన ప‌వ‌న్ క‌ల్యాణ్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు. ఆయ‌న‌ మంచి స్నేహితుడు, నిజ‌మైన జెంటిల్‌ మెన్ కూడా. నేడు సంతోషంగా గ‌డ‌పండి'' అంటూ చెప్పుకొచ్చాడు. వీరితో పాటు ర‌కుల్ ప్రీత్ సింగ్ - దేవి శ్రీ ప్ర‌సాద్‌ - బండ్ల గణేష్ - సంపత్ నంది - మారుతి - బాబీ - అల్లు శిరీష్ - మెహర్ రమేష్ - అనిల్ రావిపూడి - సుధీర్ బాబు - అల్లరి నరేష్ - నాగశౌర్య - సుధీర్ వర్మ - శ్రీకాంత్ - సురేందర్ రెడ్డి - సునీల్ - యాంకర్ ప్రదీప్ - ఎస్ జె సూర్య - సందీప్ కిషన్ - తేజ సజ్జ తదితరులు పవన్ కళ్యాణ్ కి బర్త్ డే విషెస్ అందించారు.
Tags:    

Similar News