ఫ్రెండుకి 25లక్షల ఖరీదైన వాచ్ కానుక
స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కి 14లక్షల ఖరీదైన సిగరెట్ లైటర్ ని కానుక ఇచ్చి హాట్ టాపిక్ అయ్యాడు బండ్ల గణేష్. ఆ లైటర్ ని 1455 డైమండ్స్ తో డిజైన్ చేశారు. ఇలాంటి ఖరీదైన కానుకలు ఇండస్ట్రీలో సహజమే. పలువురు దర్శకులకు హీరోలు నిర్మాతలు ఖరీదైన కార్లను కానుకలుగా ఇచ్చిన సందర్భాలున్నాయి. కోట్లాది రూపాయల సొమ్ములు ప్రవహించే ఇండస్ట్రీలో లక్షల్లో విలువ చేసే కానుకలివ్వడం పెద్ద మ్యాటరేమీ కాదు కానీ.. నిజమైన ప్రేమ ఆప్యాయతతో ఆ కానుకలు ఇచ్చినప్పుడు ఉండే కిక్కు వేరు.
తాజాగా యువ నిర్మాత బన్ని వాస్ కి స్టార్ హీరో అల్లు అర్జున్ ఇచ్చిన ఖరీదైన కానుక హాట్ టాపిక్ గా మారింది. ఎంతో విలువైన డైమండ్స్ తో తయారు చేసిన శాంటోస్ -డి కార్టియర్ వాచ్ ని కానుకగా ఇచ్చాడు. ఈ వాచ్ ఖరీదు మన కరెన్సీ లో 25 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే బన్ని వాస్ ఎంత స్నేహితుడు అయినా ఇప్పుడు ఆ కానుక ఎందుకు ఇచ్చినట్టు? అంటే.. బన్ని `అల వైకుంఠపురములో` చిత్రంతో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న ఆనందంలోనే తన ఫ్రెండుకి కానుక ఇచ్చాడట. ఇక ఈ విజయంలో బన్ని వాస్ పాత్ర తక్కువేమీ కాదు. స్క్రిప్ట్ సహా ప్రతిదాంట్లో ఈ యువ నిర్మాత ఇన్వాల్వ్ మెంట్ ఉంది. ఇక అల్లు అర్జున్ ఎంతో క్లోజ్ ఫ్రెండ్. గీతా ఆర్ట్స్ సంస్థకు బన్ని వాస్ నుంచి అన్ని రకాలుగా సహకారం ఉంటుంది.
ఒక రకంగా ఆ ఖరీదైన వాచ్.. బన్ని వాస్ బెస్ట్ జడ్జిమెంట్ కి దక్కిన కానుక ఇది అని చెప్పొచ్చు. పరిమిత బడ్జెట్లలో అన్నీ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన నిర్మాతగా బన్ని వాస్ కి ప్రత్యేకించి ఓ రేంజ్ ఉంది. అందుకే బన్ని లాంటి స్టార్ హీరో స్క్రిప్టు సహా చాలా విషయాల్లో బన్ని వాస్ సలహాలు సూచనలు తీసుకుంటాడు. సక్సెస్ దక్కిన ప్రతిసారీ ఇలా ఏవో కానుకలు ఇచ్చి ముచ్చట తీర్చుకుంటారన్నమాట.