సందిగ్ధంలో పడ్డ బోయపాటి అండ్ టీమ్...?

Update: 2020-05-17 15:46 GMT
నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మోస్ట్ పవర్ ఫుల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారని సమాచారం. బాలయ్య - బోయపాటి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 'సింహ' 'లెజెండ్' సూపర్ హిట్ అయ్యాయి. దీంతో ఈ సినిమాపై బాలయ్యతో పాటు ఆయన అభిమానులు కూడా నమ్మకంతో ఉన్నారు. ఇప్పటికే ఒక షెడ్యూల్ షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా కరోనా లాక్‌ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఈ సినిమాను బోయపాటి శ్రీను రాయలసీమ - వారణాసి బ్యాక్‌ డ్రాప్‌ లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఒక పాత్ర కోసం బాలయ్య ఏకంగా గుండు కూడా చేయించుకున్నాడు. ఈ సినిమాలో బాలయ్య మరోసారి రెండు పాత్రల్లో కనిపిస్తుండగా.. అందులో ఒకటి అఘోర పాత్ర కాగా రెండోది ఫాక్షనిస్ట్ పాత్ర అని వార్తలు వస్తున్నాయి.

ఇదిలా ఉండగా ఈ సినిమా అనుకున్నప్పటి నుండి డైలీ ఏదొక రూమర్ వస్తూనే ఉంది. ఈ ప్రాజెక్ట్ ని మొదట బాలయ్య సొంతంగా నిర్మించాలనుకున్నాడట. అయితే ఎన్టీఆర్ బయోపిక్ ఘోర పరాజయం పొందటంతో వెనక్కి తగ్గి రవీందర్ రెడ్డి చేతిలో పెట్టాడట. ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించాలని ప్లాన్ చేసినప్పటికీ బాలయ్య - బోయపాటి గత చిత్రాలను ప్రస్తుత మార్కెట్ దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ లో కోత‌లు విధించాల్సిన ప‌రిస్థితి ఏర్పడిందట. ఆ తర్వాత హీరోయిన్ విషయంలో కూడా ఈ సినిమాకి పెద్ద సమస్యగా మారిందని టాక్ వచ్చింది. చివ‌రికి అన్ని ఇబ్బందులు అధిగమించి సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తే ఇంత‌లో క‌రోనా మహమ్మారి వచ్చి బ్రేక్ వేసింది. షూటింగ్ ఆగిపోయింది. ఇక లాక్ డౌన్ ఎత్తేసి షూటింగ్స్ అనుమతిస్తే వెంటనే షూటింగ్ చేసేయాలని అందరూ ప్లాన్ చేసుకుంటున్నారు. కానీ ఈ చిత్ర యూనిట్ మాత్రం అయోమయంలో పడిందట. దానికి కారణం ఈ సినిమా ఎక్కువ భాగం నార్త్ ఇండియాలో ప్లాన్ చేయడమే.

వారణాసి కాశీతో పాటు పలు ఉత్తరాది ఫేమస్ ప్లేసెస్ లో షూటింగ్ ప్లాన్ చేశారట బోయపాటి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో పక్క రాష్ట్రాల్లో చిత్రీకరణకు అనుమతిస్తారో లేదో అనే డౌట్. బోయపాటి సినిమా అయినా డాక్యుమెంట్ అయినా భారీగా జనాలను పెట్టి రిస్క్ చేసి షూటింగ్స్ చేస్తుంటాడనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. మరి ఇప్పుడు కరోనా నేపథ్యంలో అది సాధ్యపడేలా లేదు. ఒకవేళ ఇక్కడే సెట్స్ వేసి చిత్రీకరించాలన్నా కోతలు విధించిన బడ్జెట్ పెంచాల్సి వస్తుంది. అప్పుడు ప్రొడ్యూసర్ కి భారంగా మారే అవకాశం ఉంది. ముందు ప్లాన్ చేసుకున్నట్లే షూటింగ్ చేయాలంటే మాత్రం ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. ఇలాంటి నేప‌థ్యంలో సినిమా విడుద‌ల చాలా ఆల‌స్యం కావ‌చ్చ‌ని భావిస్తున్నారట. అన్నీ కుదిరితే బాలయ్యకి కలిసివచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారట.

   

Tags:    

Similar News