ఫోటో స్టోరి: షోకేస్‌లో బొమ్మలా మిల్కీ బ్యూటీ

నేటి తరానికి సవాల్ విసిరే ఈ భామ‌ ఫ్యాషన్ సెన్స్... ఎప్పటికప్పుడు తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే తీరు త‌మ‌న్నాను అగ్రస్థానంలో నిలబెడుతున్నాయి.;

Update: 2026-05-09 05:40 GMT

దశాబ్దాలు గడిచినా... పోటీలో ఎందరు తారలు ఉన్నా `మిల్కీ వైట్ బ్యూటీ` తమన్నా భాటియా క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. నేటి తరానికి సవాల్ విసిరే ఈ భామ‌ ఫ్యాషన్ సెన్స్... ఎప్పటికప్పుడు తనను తాను కొత్తగా ఆవిష్కరించుకునే తీరు త‌మ‌న్నాను అగ్రస్థానంలో నిలబెడుతున్నాయి. ముంబై నుంచి టాలీవుడ్ వరకు సాగిన ఈ బ్యూటీ ప్రయాణంలో ఎన్నో పరిణతి చెందిన పాత్రలతో ప్రేక్షకులను మైమరిపించింది. ప్రస్తుతం తెలుగు, తమిళంతో పాటు బాలీవుడ్‌లోనూ వరుస ప్రాజెక్టులతో ఈ మిల్కీ బ్యూటీ బిజీగా గడుపుతోంది.



 


ఇటీవల ప్రముఖ డిజైనర్ రాహుల్ మిశ్రా రూపొందించిన ఐవరీ పర్ల్ కేప్ డ్రైస్‌లో తమన్నా మెరిసిన తీరు ఫ్యాషన్ ప్రపంచాన్ని అబ్బురపరిచింది. ముత్యాల మధ్య మంచి ముత్యంలా మిల్కీ లుక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కోర్సెట్-స్టైల్ బాడీస్ - ముత్యాలతో అలంకరించిన కేప్ త‌మ‌న్నాకు ఒక ప్రత్యేకమైన హుందాతనాన్ని తెచ్చిపెట్టాయి. ఈ అవుట్‌ఫిట్‌లో తమన్నా షోకేస్‌లో ఉంచిన అందమైన బొమ్మలా కనిపిస్తూ ఫ్యాషన్ ప్రియుల నీరాజనాలు అందుకుంటోంది.



 


త‌మ‌న్నా మేకప్ - స్టైలింగ్ కూడా ఈ లుక్‌కు మరింత అందాన్ని జోడించాయి. సింపుల్ మేకప్, లూజ్ వేవీ హెయిర్‌స్టైల్.. మెరిసే తెల్లటి హీల్స్ త‌మ‌న్నాలోని యూనిక్ నెస్‌ని ఎలివేట్ చేశాయి. కేవలం అందం మాత్రమే కాదు... తన ఆహార్యంలో త‌మ‌న్నా చూపే వైవిధ్యం త‌న‌ను గ్లోబల్ ఐకాన్‌గా మారుస్తోంది. రెండు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో తమన్నా సాధించిన ఈ ఎత్తు క‌చ్చితంగా త‌న‌ పట్టుదలకు... ఫ్యాషన్ పై త‌న‌కు ఉన్న అభిరుచికి నిదర్శనం.




 


తమన్నా ప్రస్తుత సినిమా విషయానికి వస్తే.. ఈ సంవత్సరం తమన్నా కెరీర్‌లో అత్యంత కీలకమైనదిగా మారుతోంది. త‌మ‌న్నా నటించిన `ఓ రోమియో` ఫిబ్ర‌వ‌రిలో విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. షాహిద్ స‌ర‌స న‌టించిన ఈ చిత్రానికి మిశ్ర‌మ స్పంద‌న‌లు వ‌చ్చినా... త‌మ‌న్నా గ్లామ‌ర్ కి మంచి గుర్తింపు ద‌క్కింది. త‌దుప‌రి ఆగ‌స్టులో విడుద‌ల కానున్న `వివాన్ - ఫోర్స్ ఆఫ్ ది ఫారెస్ట్`, అజ‌య్ దేవ‌గన్ తో చేస్తున్న `రేంజ‌ర్`పై చాలా ఆశ‌లే పెట్టుకుంది. రేంజ‌ర్ డిసెంబర్ 4న విడుద‌ల కానుంది. వీటితో పాటు తమిళంలో యేన్ ఎండ్రు కాద‌ల్ ఎన్బెన్, పురుష‌న్ లాంటి చిత్రాల‌లో న‌టిస్తోంది.

Tags:    

Similar News