• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బోయపాటి తదుపరి సినిమా.....

బోయపాటి తదుపరి సినిమా.. ఎవరితో అంటే?

By - Tupaki Desk
Update: 2021-05-25 08:37 GMT
తెలుగు చిత్రపరిశ్రమలో సూపర్ హిట్ కాంబినేషన్స్ మళ్లీ ఒక్కక్కటిగా రిపీట్ అవుతున్నాయి. ఎందుకంటే వేరే లేదా నూతన దర్శకులతో సినిమాలు చేస్తే మాక్సిమం ఫలితాలు బోల్తా కొడుతున్నాయని టాక్. అందుకే ఇంతకుముందు బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన డైరెక్టర్స్ వైపే మొగ్గు చూపుతున్నారు హీరోలు. ప్రస్తుతం అలాంటి సూపర్ హిట్ కాంబినేషన్స్ లో నందమూరి బాలయ్య - బోయపాటి శీను కాంబో ఒకటి. వీరి కాంబినేషన్ లో ప్రస్తుతం ముచ్చటగా మూడో సినిమా రూపొందుతుంది. ఇటీవలే ఈ సినిమాకు అఖండ అనే టైటిల్ ఖరారు చేసినట్లు టీజర్ ద్వారా ప్రకటించారు మేకర్స్. గతంలోనే వీరి కాంబినేషన్ లో సింహా, లెజెండ్ సినిమాలు తెరకెక్కి ఓ రేంజిలో హిట్స్ అందుకున్నాయి.

అలాగే ఇప్పుడు మూడోసారి హ్యాట్రిక్ హిట్టు కొడతారనే నమ్మకంతో వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే ఇదివరకే బాలయ్యను చాలామంది దర్శకులు పవర్ ఫుల్ గా చూపించారు. కానీ వారందరిలో బోయపాటి మేకింగ్ చాలా క్లిక్ అయిపోయారు ప్రేక్షకులు. బాలయ్యతో ఈరోజుల్లో ఇండస్ట్రీని షేక్ చేసే సినిమా తీయగలిగేది బోయపాటి మాత్రమే అనే అని నందమూరి అభిమానులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం సినిమా షూటింగ్ చివరిదశలో ఉందట. నిజానికి ఈ నెలలోనే సినిమా విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా సినిమా వాయిదా పడింది. అయితే ఇప్పుడు లాక్డౌన్ లో చాలామంది దర్శకులు తమ తదుపరి సినిమాలను లైన్ లో పెడుతున్నారు.

అలాగే బోయపాటి కూడా తన తదుపరి సినిమాను సెట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇటీవలే బోయపాటి అల్లు అర్జున్ తో గీతాఆర్ట్స్ బ్యానర్ పై ఓ మాస్ సినిమా చేయనున్నట్లు టాక్ వచ్చింది. అలాగే అల్లు అర్జున్ కు స్టోరీ లైన్ కూడా వినిపించడం జరిగిందట. కానీ అల్లు అర్జున్ తో సినిమా ఇప్పట్లో కుదరదు. ఎందుకంటే ఆల్రెడీ బన్నీ భారీ సినిమాలు లైన్ లో పెట్టాడు. అయితే బోయపాటి మాస్ రాజా రవితేజతో కూడా ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీరి కాంబినేషన్ లో భద్ర అనే సినిమా వచ్చి సూపర్ హిట్ అయింది. అయితే ఇప్పుడు రవితేజతో సినిమా ఉన్నప్పటికీ ఇప్పట్లో రాదని అర్ధమవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ మాస్ రాజా రెండు మూడు సినిమాలు కమిట్ అయ్యాడు. మరి ఈ లెక్కన బోయపాటి ఏ హీరోను ఓకే చేసుకుంటాడో చూడాలి.
Tags:    
  • Balayya 
  • Boyapati 
  • Legend 
  • Simha 
  • BB3 
  • Bala Krishna 
  • Balayya 
  • Boyapati 
  • Legend 
  • Simha 
  • BB3 
  • Bala Krishna 
  • akhanda movie 

Similar News

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

Copyright @2026

Powered by Blink CMS