ఎన్టీఆర్ సినిమాలో బాలీవుడ్ స్టార్స్..!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ 'ఆర్.ఆర్.ఆర్' లో నటిస్తున్నారు. దీని తర్వాత తారక్ చేయబోయే మరో రెండు ప్రాజెక్ట్స్ కు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. వాటిలో కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనున్న పాన్ ఇండియా మూవీ కూడా ఉంది.
'జనతా గ్యారేజ్' వంటి సూపర్ హిట్ తర్వాత వీరి కాంబోలో వస్తున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం కొరటాల శివ NTR30 చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. తనదైన శైలిలో సామాజిక అంశాలు - కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా దర్శకుడు ఈ స్టోరీ రెడీ చేస్తున్నారట. అది కూడా స్టూడెంట్ పాలిటిక్స్ నేపథ్యంలో ఉంటుందని టాక్.
అలానే పాన్ ఇండియా స్థాయిలో రూపొందే సినిమా కాబట్టి పలువురు బాలీవుడ్ స్టార్స్ ని తీసుకోనున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో 'భరత్ అనే నేను' సినిమాతో తాను టాలీవుడ్ కు పరిచయం చేసిన ఉత్తరాది భామ కియారా అద్వానీ ని హీరోయిన్ గా ఫైనలైజ్ చేశారని వార్తలు వస్తున్నాయి. దీని కోసం కియరా కు భారీ రెమ్యూనరేషన్ ఇస్తున్నారట.
అంతేకాదు ఈ చిత్రంలోని ఓ కీలక పాత్ర కోసం ఓ బాలీవుడ్ స్టార్ యాక్టర్ ని సంప్రదిస్తున్నారని సమాచారం. అయితే ఆ నటుడు ఎవరనేది తెలియలేదు. రాబోయే రోజుల్లో దీనిపై క్లారిటీ వస్తుంది. ఇకపోతే తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి వర్క్ చేయనున్నాడని తెలుస్తోంది. దీనికి 'సెన్సేషనల్' అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
నందమూరి కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 'ఆర్.ఆర్.ఆర్' సినిమా పూర్తయిన తర్వాత NTR30 ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇదే క్రమంలో 'కె.జి.యఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ తో తారక్ ఓ పాన్ ఇండియా మూవీ చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందుతుంది.