పాక్ సింగర్ పగిలిపోయే జవాబు
బాలీవుడ్ మాత్రమే కాదు యావత్ సినీ సంగీత ప్రేమికులకు బాగా సుపరిచితమైన పేరు అద్నాన్ సమీ. హిందీ పాప్ ఆల్బమ్స్ ద్వారా బాగా పాపులర్ అయిన ఇతగాడు దేవి శ్రీ ప్రసాద్ పుణ్యమా అని వర్షం నుంచి మంచి బ్రేక్ తెచ్చుకుని తెలుగులో కూడా ఇప్పటిదాకా చాలా పాటలే పాడాడు. శంకర్ దాదా జిందాబాద్ లో ఏ జిల్లా ఓ పిల్లా నీది ఏ జిల్లా ఇష్క్ లో ఓ ప్రియా ప్రియా ఊసరవెల్లిలో నేనంటే నీకూ చాలా ఇష్టం లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ ట్రాక్స్ ఇతని ఖాతాలో ఉన్నాయి.
అద్నాన్ సమీ పుట్టుకరిత్యా పాకిస్థానీ. కానీ భారత దేశ పౌరసత్వాన్ని తీసుకుని దశాబ్దాల క్రితమే ఇక్కడ సెటిలైపోయాడు. పుల్వామా ఘటన తర్వాత పాక్ కు చెందిన నటీనటులు గాయని గాయకుల మీద నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అద్నాన్ సమీ ఇండియన్ సిటిజెన్ కాబట్టి అతనికి ఇది వర్తించదు. అయినా సోషల్ మీడియా ట్రాలర్స్ ఇతన్నే టార్గెట్ గా పెట్టుకుని కొందరు వెకిలి కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు
దానికి అద్నాన్ సమీ ధీటైన జవాబు ఇచ్చాడు. టెర్రరిస్టుల కంటే మీ ఈగోలు ప్రమాదకరంగా ఉన్నాయని ముందు వాటిని తరిమేయమని చెబుతూ వాస్తవ ప్రపంచంలోకి వచ్చి నిజాలు తెలుసుకోవాలని సూచించాడు. అంతే కాదు చెత్త నిండి ఉన్న బకెట్ కు ఇలాంటి వ్యక్తులకు తేడా కేవలం బకెట్ మాత్రమే అని తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. అద్నాన్ సమీ మొన్న వైమానిక దాడులు జరిగిన కొంతసేపటికె సేనల ధైర్య సాహసాలను ప్రశంసిస్తూ మోడీకి పూర్తి మద్దతు ప్రకటించాడు.హౌ ఈజ్ ది జోష్ అంటూ తీవ్రవాదులకు చురక కూడా వేసాడు. అయినా తనను ట్రాల్ చేయడం పట్ల మనస్థాపం చెందిన అద్నాన్ సమీ మొత్తానికి సరైన రీతిలోనే బదులు చెప్పాడు. నెటిజెన్ల నుంచి మద్దతు కూడా దక్కుతోంది