నాలుగేళ్లలో మూడే మూడు ఏం సాధించినట్లు?
కేవలం క్లాస్ లేదా ఎమోషనల్ పాత్రలకే పరిమితం కాకుండా కెరీర్ నిలదొక్కుకోవాలంటే అమ్మడు ప్రాధాన్యతలను మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
`సీతారామం` చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మృణాల్ ఠాకూర్ తొలి చిత్రంతోనే సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఆ సినిమా అందించిన విజయం తర్వాత అమ్మడు టాలీవుడ్‌లో బిజీ హీరోయిన్ అవుతుందని అందరూ భావించారు. కానీ గత నాలుగేళ్లలో ఆమె కెరీర్ గ్రాఫ్‌ను పరిశీలిస్తే ఆశించిన స్థాయిలో ప్రాజెక్టులు లేవనేది స్పష్టంగా కనిపిస్తోంది. `సీతారామం` తర్వాత నానితో చేసిన `హాయ్ నాన్న` మినహా చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలు ఆమె ఖాతాలో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. నాలుగేళ్ల సుదీర్ఘ కాలంలో మూడే మూడు చిత్రాలకు పరిమితం కావడం స్టార్ హీరోయిన్ రేసులో అమ్మడిని వెనుకబడేలా చేస్తోంది.
ఈ పరిస్థితి చూస్తుంటే ఒకప్పటి కీర్తి సురేష్ కెరీర్ గమనం గుర్తుకురాక మానదు. `మహానటి` వంటి చారిత్రాత్మక విజయం తర్వాత కీర్తి కూడా ఇదే తరహాలో నెమ్మదించడంతో ఒక దశలో టాలీవుడ్‌లో ఆమె స్థానం ప్రశ్నార్థకమైంది. ఆ తర్వాత కీర్తి పద్ధతిని మార్చుకుని పాత్రల ఎంపికలో సరళత చూపడం, కమర్షియల్ సినిమాలకు కూడా ఓకే చెప్పడంతో మళ్లీ పుంజుకుంది. తాజాగా మృణాల్ ఠాకూర్ కూడా అదే దారిలో పయనించక తప్పేలా లేదు. కేవలం క్లాస్ లేదా ఎమోషనల్ పాత్రలకే పరిమితం కాకుండా కెరీర్ నిలదొక్కుకోవాలంటే అమ్మడు ప్రాధాన్యతలను మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
కొత్త హీరోయిన్లు వందల సంఖ్యలో పోటీ పడుతున్న తరుణంలో స్టార్ హీరోయిన్ హోదాను కాపాడుకోవాలంటే? కేవలం కంటెంట్ మాత్రమే ఉంటే సరిపోదు. దర్శకనిర్మాతలకు అందుబాటులో ఉండటం, పాత్రల విషయంలో కఠినమైన నిబంధనలు తగ్గించుకోవడం వంటివి అత్యంత కీలకం. మృణాల్ గనుక ఎంపికలలో కీర్తి సురేష్‌లాగా కొంత ఫ్లెక్సిబిలిటీని ప్రదర్శించకపోతే? టాలీవుడ్ నిర్మాతలు ఇతర ఆప్షన్ల వైపు చూసే ప్రమాదం ఉంది. ఇప్పటికే మృణాల్ గ్యాప్ వల్ల చాలా అవకాశాలు చేజారిపోయాయని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
సక్సెస్ అనేది ప్రవాహం లాంటిది. ఒక సినిమా హిట్ అయ్యాక వచ్చే క్రేజ్‌ను సరిగ్గా వాడుకోకపోతే? ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి నిమిషాల్లో వేరే తారలు సిద్ధంగా ఉంటారు. మృణాల్‌కు ఉన్న సౌందర్యం, నటన పట్ల ఆమెకున్న అంకితభావం అద్భుతం. కానీ కమర్షియల్ సినిమాల్లో తనకంటూ స్పేస్ క్రియేట్ చేసుకోలేకపోతే నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలే చేస్తూ కూర్చుంటే బాక్సాఫీస్ వద్ద మార్కెట్ స్థిరపడటం కష్టం. ఇప్పటికైనా మృణాల్ మేల్కొని లైనప్‌లో వైవిధ్యం పెంచకపోతే టాలీవుడ్ అమ్మడిని లైట్ తీసుకునే అవకాశం లేకపోలేదు.
ప్రతిభ ఒక్కటే సరిపోదు. సరైన సమయంలో సరైన అడుగులు వేయడం అంతే కీలకం. కీర్తి సురేష్ తప్పులను సరి దిద్దుకుని ఎలాగైతే? మళ్లీ ఫామ్‌లోకి వచ్చిందో.. మృణాల్ కూడా ఇప్పటికైనా ఆలోచనా విధానంలో మార్పులు తెచ్చుకోవాలని సన్నిహితులు సూచిస్తున్నారుట. ఎంపిక చేసుకున్న ప్రాజెక్టుల సంఖ్య పెరగడమే కాదు. ప్రేక్షకులకు కావలసిన కమర్షియల్ హంగులను కూడా పాత్రలకు జోడిస్తేనే టాలీవుడ్‌లో సుదీర్ఘ ప్రయాణం సాధ్యమవుతుందని హితబోద చేసినట్లు తెలిసింది.