ఆ స్టార్ హీరోను చూసి మిగతా వాళ్లు నేర్చుకోవాలా?
ఇది నిజంగా నిర్మాతలకు వరప్రసాదం. సినిమా సెట్స్‌లో ఆ స్టార్ హీరో సమయపాలన, నిబద్ధత చూసి ముగ్ధులయ్యారు.
పరిశ్రమలో నిర్మాతలు ఎదుర్కొనే అతి పెద్ద సవాలు హీరోల షూటింగ్ డేట్లు. స్టార్ హీరోల డేట్లు దొరకడం ఒక ఎత్తయితే? వారు ఇచ్చిన సమయానికి సెట్స్‌కు రావడం, షూటింగ్‌ను సకాలంలో పూర్తి చేయడం మరో పెద్ద సమస్య. అయితే కోలీవుడ్‌లో ఓ స్టార్ హీరో మాత్రం అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. నెలలో దాదాపు 20 రోజుల పాటు వరుసగా షూటింగ్‌కు కేటాయిస్తూ నాలుగు నుండి ఐదు నెలల పాటు అదే క్రమశిక్షణను పాటిస్తున్న ఆయన పని తీరుపై ఓ నిర్మాత ఆశ్చర్యం వ్యక్తం చేసారు. నిర్మాత మాటల్లో చెప్పాలంటే, `ఆయనతో పనిచేయడం ఒక అద్భుతమైన అనుభవం.
ఇది నిజంగా నిర్మాతలకు వరప్రసాదం. సినిమా సెట్స్‌లో ఆ స్టార్ హీరో సమయపాలన, నిబద్ధత చూసి ముగ్ధులయ్యారు. నిర్ణీత సమయం కంటే ముందుగానే సెట్స్‌కు రావడం, ఒక్క టేక్‌లోనే షాట్స్ పూర్తి చేసే సింగిల్ టేక్ ఆర్టిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు. సినిమా షూటింగ్ అంటేనే భారీ బడ్జెట్‌తో కూడిన వ్యవహారం. హీరో సమయపాలన పాటించకపోతే ఆ ప్రభావం నిర్మాత జేబుపైనే పడుతుంది. ముఖ్యంగా ఒకేసారి 20 రోజుల పాటు షూటింగ్ షెడ్యూల్ కేటాయించడం వల్ల చిత్రీకరణ వేగంగా ముందుకు సాగుతుంది.
దీంతో ప్రొడక్షన్ ఖర్చులు భారీగా తగ్గుతాయి సకాలంలో సినిమా విడుదల చేసే అవకాశం ఉంటుందని నిర్మాత చెబుతున్నారు. నేటి కాలంలో స్టార్ ఇమేజ్ ఉన్న హీరోల నుంచి ఇలాంటి నిబద్ధతను ఆశించడం కష్టమని కానీ ఆ కోలీవుడ్ సూపర్ స్టార్ మాత్రం మినహాయింపుగా నిలిచారని కొనియాడారు. మిగతా హీరోలు కూడా ఇలాంటి పద్ధతులను అనుసరిస్తే బాగుంటుందని పరిశ్రమలోని చాలా మంది నిర్మాతలు భావిస్తున్నారు. ఎందుకంటే ఒక సినిమా విజయం అనేది కేవలం కంటెంట్‌పైనే కాదు. నిర్మాణ దశలో పాటించే క్రమశిక్షణపై కూడా ఆధారపడి ఉంటుంది.
హీరో షూటింగ్‌కు సకాలంలో హాజరైతే దర్శకుడికి ప్లాన్ చేసిన సమయం కంటే ముందే షూటింగ్ పూర్తి చేసే వెసులు బాటు ఉంటుంది. ఆ స్టార్ హీరో చూపిస్తున్న బాధ్యతాయుతమైన వైఖరి మిగతా పరిశ్రమల్లో కొత్త సంస్కృతికి నాంది పలుకుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్టార్ హీరోలంటే బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం మాత్రమే కాదు. నిర్మాతకు అన్ని రకాలుగా సహకరించడం కూడా. ఇతర పరిశ్రమల హీరోలు కూడా ఇలాంటి క్రమశిక్షణను అలవర్చుకుంటే అది సినీ నిర్మాణాన్ని మరింత సులభతరం చేస్తుంది. క్రమశిక్షణ లేని హీరోల వల్ల ఇబ్బందులు పడే ఎంతో మంది చిన్న, పెద్ద నిర్మాతలకు ఆ స్టార్ హీరో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. రాబోయే రోజుల్లో మిగతా తారలు కూడా ఇలాంటి బాధ్యతాయుతమైన అడుగులు వేస్తారని నిర్మాతలు ఆశీస్తున్నారు.