మరో సౌత్ సినిమాపై కన్నేసిన బాలీవుడ్ మేకర్స్
ఒకప్పుడు సౌత్ సినిమాలను ఉత్తరాది వారు చిన్న చూపు చూసేవారు. కాని ఇప్పుడు మాత్రం సౌత్ సినిమాలను ఉత్తరాది వారు ఎక్కువగా ఆధరిస్తున్నారు. ప్రేక్షకులు సౌత్ సినిమాలు అంటే ప్రత్యకమైన ఆసక్తిని చూపిండంతో పాటు సౌత్ సినిమాలను రీమేక్ చేసేందుకు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ చాలా ఇంట్రెస్ట్ తో ఉంటున్నారు.
ఇటీవల కాలంలో పదుల సంఖ్యలో సౌత్ సినిమాలు ఉత్తరాదిన రీమేక్ అయ్యాయి... ప్రస్తుతం కూడా రీమేక్ అవుతూనే ఉన్నాయి. తెలుగు సినిమాలు ఈమద్య కాలంలో చాలా హిందీలో రీమేక్ అవుతున్నాయి. ఇక త్వరలో మరో సౌత్ సినిమా కూడా హిందీ ప్రేక్షకుల ముందుకు వెళ్లేందుకు రెడీ అవుతుంది.
తమిళంలో సూర్య హీరోగా సుధ కొంగర దర్శకత్వంలో రూపొందిన సూరారైపోట్రు సినిమాను తెలుగులో ఆకాశమే నీ హద్దురా అనే టైటిల్ తో డబ్బింగ్ చేస్తున్నారు. తమిళం మరియు తెలుగులో ఒకే సారి ఓటీటీ ద్వారా విడుదల కాబోతున్న ఈ సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక సామాన్య పైలెట్ ఒక ఎయిర్ కంపెనీని ఎలా ప్రారంభించాడు.. సామాన్యులకు ఎలా విమాన ప్రయాణంను చేరువ చేశాడు అనే కథాంశంతో ఈ సినిమాను రూపొందించారు.
బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేలా ఈ కథ ఉందని.. తప్పకుండా హిందీలో రీమేక్ చేయాలనే ఉద్దేశ్యంతో ఇక్కడ విడుదల కాకుండానే రీమేక్ రైట్స్ ను ప్రముఖ నిర్మాణ సంస్థ కొనుగోలు చేసింది. సినిమా విడుదలైన వెంటనే రీమేక్ పనులు మొదలు పెట్టే అవకాశం ఉంది. ఇక్కడ యావరేజ్ టాక్ వచ్చినా కూడా హిందీ రీమేక్ పనులు మొదలు అవ్వనున్నాయి.