సర్దార్ డైరెక్టర్ నమ్మకం చూశారా!!

Update: 2016-08-29 07:30 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా తీశాడు దర్శకుడు బాబీ అలియాస్ కేఎస్ రవీంద్ర. సర్దార్ ఫ్లాప్ తర్వాత పవన్ పై బాబీ అలిగాడని.. పవన్ కోటరీ నుంచి తప్పుకున్నాడని రకరకాల న్యూస్ వచ్చాయి. కానీ రీసెంట్ గా తిరుపతిలో పవన్ కళ్యాణ్ స్పీచ్ కి బాబీ రియాక్షన్ చూస్తే అవన్నీ రూమర్స్ అని తేలిపోతుంది.

'కేవలం యాక్టర్ మాత్రమే కాదు.. మంచి మనిషి.. ఫిలాంత్రఫిస్ట్.. రాజకీయ నాయకుడు. ఒక నిజమైన పవర్ ఫుల్ లీడర్. ఎంతో స్ఫూర్తిని నింపే స్పీచ్ ఇది. రాష్ట్రానికి కేంద్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు.. ఎమ్మెల్యేలు ఇవాల్టి నుంచి నిద్రలేని రాత్రులు గడుపుతారని అనుకుంటున్నా. ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు రానున్నవన్నీ మంచి రోజులే'.. ఇదీ బాబీ చేసిన ట్వీట్స్ సారాంశం.

ఒక డిజాస్టర్ మూవీని డైరెక్ట్ చేసినంత మాత్రాన.. పవన్ నుంచి బాబీ దూరం కాలేదనేందుకు ఈ ట్వీట్స్ సరిగ్గా సరిపోతాయి. పవన్ పట్ల ఈ దర్శకుడికి ఎంతటి ఆరాధన ఉందో కూడా అర్ధం చేసుకోవచ్చు. మళ్లీ ఈ డైరెక్టర్ ట్రాక్ లోకి వచ్చేసేందుకు పెద్దగా టైమ్ పట్టకపోవచ్చు. కాకపోతే కాస్త టైమ్ పడుతుందంతే. ఈసారి పవన్ కి తనే స్టోరీ అందించి.. మరో సినిమా తీయాలనే ఆలోచనలో ఉన్నాడట బాబీ.
Tags:    

Similar News