• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ఓటీటీ బిగ్ బాస్ షురూ.....

ఓటీటీ బిగ్ బాస్ షురూ.. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన 17 మంది వీరే

By - Tupaki Desk
Update: 2022-02-27 04:31 GMT
కొన్నిసార్లు రోటీన్ కు భిన్నమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. ప్రేక్షకుల ఆసక్తిని తమకు అనుకూలంగా మార్చుకోవటానికి వీలుగా కొత్త కొత్త ప్రయోగాలు తెర మీదకు వస్తుంటాయి. తాజాగా నాన్ స్టాప్ ఎంటర్ టైన్ మెంట్ గా మారిన ఓటీటీ బిగ్ బాస్ కూడా ఈ కోవకు చెందిందే. ఏడాదికి ఒకసారి టీవీ చానల్ లో ప్రసారమయ్యే బిగ్ బాస్ రియాల్టీ షోకు ఎంతటి ఆదరణ ఉంటుందో తెలిసిందే.

మరి.. ఇంత జనాదరణ పొందే కార్యక్రమాన్ని ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తే.. ఆ కిక్కే వేరుగా ఉంటుంది కదా? అదే ఆలోచనకు రూపమిచ్చారు డిస్నీ హాట్ స్టార్. తమ ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద ఓటీటీ బిగ్ బాస్ షోను శనివారం గ్రాండ్ గా లాంఛ్ చేశారు. 84 రోజుల పాటు సాగనున్న ఈ ఓటీటీ బిగ్ బాస్ కు.. ఎప్పటిలానే కింగ్ నాగార్జున హోస్టుగా వ్యవహరించనున్నారు.

తన ఎంట్రీతోనే స్టాప్.. దిస్ ఈజ్ బిగ్ బాస్ నాన్ స్టాప్ అంటూ ఉత్సాహంగా ప్రకటించారు. ఈ రియాల్టీ షోకు సంబంధించి ముందు నుంచి వస్తున్న వార్తలకు తగ్గట్లే.. 17 మంది హౌస్ మేట్స్ ను ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఈసారి ఆసక్తికర అంశం ఏమంటే.. మొత్తం 17 మంది కంటెస్టెంట్లలో పది మంది లేడీ కంటెస్టెంట్లు ఉంటే.. ఏడుగురు మాత్రమే మేల్ కంటెస్టెంట్లు ఉన్నారు. ఇక.. హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన 17 మంది పోటీదారులు వారికి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ విశేషాల్ని చూస్తే..

1.  ఆషురెడ్డి
- యాంకర్ కమ్ సోషల్ మీడియా సంచలనం
-  నిత్యం ఫోటో షూట్లు.. చిట్టి వీడియోలతో రచ్చ చేయటం.. బిగ్ బాస్ మూడో సీజన్ లో ఫినాలే కు వెళ్లలేకపోయారు.
- బుల్లితెర సమంతలా చెప్పే ఆషూరెడ్డి.. మాంచి ఉత్సాహం మీద ఉంది.. తాను ఆట ఆడితే ఎలా ఉంటుందో హౌస్ లో చూపిస్తానని చెప్పి మరీ ఎంట్రీ ఇచ్చింది.

2. మహేశ్ విట్టా
- టాలీవుడ్.. బుల్లితెర నటుడు
- సోషల్ మీడియాలోనూ.. షార్ట్ ఫిలిమ్స్ తో సుపరిచితుడు
-  బిగ్ బాస్ షోతో తన కల తీరిందని.. మెగాస్టార్ చిరును కలిసే అవకాశం దక్కిందని చెప్పాడు. బిగ్ బాస్ రెండో సీజన్ లో పాల్గొని.. ఫస్ట్రేషన్ తో బయటకు వెళ్లిపోయాడు. ఈసారి మాత్రం గతంలో మాదిరి పొరపాట్లు చేయనంటున్నాడు.

3. ముమైత్ ఖాన్
- టాలీవుడ్ డ్యాన్సర్
- ఐటెం సాంగ్ లకు కేరాఫ్ అడ్రస్
- వచ్చి రాని తెలుగుతో గతంలోనూ బిగ్ బాస్ షోలో సందడి చేసి.. ఫినాలే వరకు రాకుండా వెళ్లిపోవటం.. రియాల్టీ షో మధ్యలో డ్రగ్స్ కేసు విచారణకు బయటకు వచ్చి మరీ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వటం తెలిసిందే. ఈసారి మాత్రం ఫినాలేకు పక్కా అంటోంది. బిగ్ బాస్ షోలో పాల్గొని బయటకు వెళ్లాక తన జీవితంలో చాలా మార్పులు వచ్చినట్లుగా చెప్పింది.

4. అజయ్
-  కొత్త కుర్రాడు. ఒకట్రెండు సినిమాల్లో నటించాడు.
- మొండిగా ఉంటానని చెబుతూ.. సీనియర్లతో ఈ జూనియర్ ఎలాంటి ఆట ఆడతాడో చూడాలి.

5. స్రవంతి చొక్కారపు
-  యాంకర్.. సోషల్ మీడియా సంచలనం
- హుషారుకు కేరాఫ్ అడ్రస్
- బ్యూటీఫుల్ స్మైల్ తో ఎవరినైనా ఫిదా చేస్తాననే ధీమా ఉన్న ఆమె.. తనకు గతంలో రెండుసార్లు పెళ్లి చేసుకున్న విషయాన్ని చెప్పి..ఎంట్రీ వేళలోనే అందరూ తన గురించి మాట్లాడుకునేలా చేసింది.

6. ఆర్జే చైతూ
- ఆర్జేగా సుపరిచితుడు
- హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే వేళలోనే సర్ ప్రైజ్ అంటూ అతడి తల్లిని స్టేజ్ మీదకు ఆహ్వానిచి.. అతడికి ఎంతో ఇష్టమైన చికెన్ బర్గర్ ఇచ్చి మరీ ఇంట్లోకి పంపారు. బెజవాడకు చెందిన ఈ కుర్రాడు హైదరాబాద్ కు వచ్చి సెటిల్ అయ్యాడు. ఆర్జే అవతారం ఎత్తిన తర్వాత ఆరు అవార్డుల్ని సొంతం చేసుకున్న బ్యాక్ గ్రౌండ్ ఉంది. తాను నోరు విప్పితే అడ్డుకట్ట వేయటం కష్టమంటున్నాడు.

7. ఆరియానా
- యాంకర్.. టీవీ షోల్లో వ్యాఖ్యాత
- నటి కమ్ సోషల్ మీడియా సంచలనం
- బిగ్ బాస్ 4 ద్వారా అందరికి దగ్గరైంది. బిగ్ బాస్ తర్వాత లైఫ్ మారిపోయిందన్న ఆమె మరోసారి బిగ్ బాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చి.. తానేమిటో చూపించే మరో ఛాన్సు లభించినట్లు చెబుతోంది. బిగ్ బాస్ 5కు సీజన్ బజ్ కు వ్యాఖ్యతగా వ్యవహరించి.. తన హుషారుతో అందరిని ఫిదా చేసింది.

8. నటరాజ్ మాస్టర్
-  కొరియోగ్రాఫర్
- డ్యాన్స్ షోలకు మెంటార్
- బిగ్ బాస్ సీజన్ 5లో తనదైన ఆటతో అందరిని ఆకట్టుకున్నా.. మధ్యలో వెనుదిరగాల్సి వచ్చింది. బిగ్ బాస్ 5కు తన భార్య కోసం వస్తే.. ఓటీటీ బిగ్ బాస్ కు మాత్రం తన పాప కోసం వచ్చినట్లు చెప్పారు.

9. శ్రీరాపాక
- వర్మ నగ్నం మూవీలో హీరోయిన్ గా సుపరిచితురాలు
- ఫ్యాషన్ డిజైనర్
- కోకో.. కబడ్డి క్రీడాకారిణి
- ఎంటర్ టైన్ మెంట్ అనే మెడిసిన్ తో అందరికి వినోదాన్ని ఇస్తానని చెబుతున్న ఆమె.. బిగ్ బాస్ లో అవకాశం తనకు డైమెండ్ తో సమానమని చెబుతోంది. తూర్పుగోదావరి జిల్లాలో పుట్టినా హైదరాబాద్ లోనే సెటిల్ అయ్యారు. దుమ్ము దులిపేస్తా.. రేసుగుర్రంలా వచ్చానంటున్న ఆమె హడావుడి ఏమిటో రాబోయే ఎపిసోడ్స్ లో చూడాలి.

10. అనిల్ రాథోడ్
- మోడల్
- ప్రేక్షకులకు ఏ మాత్రం పరిచయం లేని వ్యక్తి. తండ్రి.. తాత పోలీసు శాఖలో పని చేశారు. ఇంట్లోని వారికి ఇష్టం లేకున్నా మోడలింగ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికే పలు అవార్డుల్ని సొంతం చేసుకున్నాడు.
- బుగ్గ మీద లిప్ మార్కుతో స్టేజ్ మీదకు అడుగు పెట్టి.. అదెవరు ఇచ్చారో చెప్పాలంటూ బిగ్ బాస్ ఇంట్లోకి పంపారు.

11. మిత్రశర్మ
- నటి
-  తొలి సంధ్యవేళలో చిత్రంలో హీరోయిన్. మరో రెండు సినిమాల్లోనూ నటించారు.
- ప్రస్తుతం నిర్మాతగా బాయ్స్ అనే మూవీని నిర్మించారు

 12. తేజస్వీ
- నటి
- పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించారు
- తల్లి క్యాన్సర్ బారిన పడి చనిపోతే.. తండ్రి ఆర్మీ అధికారి అయినా మద్యానికి బానిస. ప్రతికూల పరిస్థితులు.. ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల మధ్య మొదలైన ఆమె ప్రయాణం.. గ్లామర్ ఫీల్డ్ లో తన టాలెంట్ తో అవకాశాల్ని అందిపుచ్చుకుంది. పలు సినిమాల్లో నటించినా.. రాంగోపాల్ వర్మ ఐస్ క్రీం సినిమాలో హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. బిగ్ బాస్ సీజన్ 2లో అవకాశం వచ్చినా.. పినాలే వరకు వెళ్లలేకపోయింది.

13. సరయూ
- నటి
- అడల్ట్ కామెడీ వీడియోలతో ఫేమస్
- బోల్డుగా మాట్లాడి.. బూతులు తిట్టేసేందుకే ఏమాత్రం మొహమాటపడని ఆమె బిగ్ బాస్ 5 సీజన్ లో మొదట ఎలిమినేట్ అయిన సెలబ్రిటీగా గుర్తింపు పొందింది. ఆమె ఎలిమినేషన్ పై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. తాజాగా ఓటీటీలో వచ్చిన అవకాశంతో దుమ్ము దులిపేస్తానంటోంది.ఫైర్ బ్రాండ్ ట్యాగ్ తో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. బూతుల్ని ఏ మేర వాడేస్తుందో చూడాలి.

14.  యాంకర్ శివ
- యాంకర్
- యూట్యూబర్
- వివాదాస్పద ఇంటర్వ్యూలతో సుపరిచితుడైన యాంకర్ శివ.. బిగ్ బాస్ కంటెస్టెంట్లను సైతం గతంలో ఇంటర్వ్యూలు చేశాడు. చెల్లి పెళ్లి కోసం బిగ్ బాస్ షోకు వచ్చినట్లు చెబుతున్న అతడి ప్రయాణం ఎలా సాగుతుందో చూడాలి.

15. బిందుమాధవి
- సినీ నటి.. హీరోయిన్
- అవకాయ బిర్యానీతో ఎంట్రీ ఇచ్చిన ఈ తెలుగు అమ్మాయికి సరైన అవకాశాలు రాలేదు. కన్నడ ఇండస్ట్రీకి వెళ్లిన ఆమె అవకాశాలు బాగానే ఉన్నా.. బిగ్ బాస్ తో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర కావాలన్న ప్రయత్నంలో తాజాగా ఎంట్రీ ఇచ్చారు.

16. హమిదా
- నటి.. మోడల్
- అందంగా..అంతకు మించిన ఆకర్షణీయంగా ఉండే హమీదా.. సాహసం చేయరా డింభకా మూవీలో నటించినా.. ఆమెకు సరైన బ్రేక్ రాలేదు. బిగ్ బాస్ 5 సీజన్ లో ఎంట్రీ ఇచ్చి సింగర్ శ్రీరామ్ స్నేహితుడిగా కంటే కూడా ప్రేమికుడిగా ప్రేక్షకుల మదిలో రిజిస్టర్ అయ్యింది. శ్రీరామచంద్ర కు దగ్గరగా ఉన్న ఆమె.. బిగ్ బాస్ హౌస్ లో తానేమిటో ఫ్రూవ్ చేసుకోలేదని చెబుతారు. మరీ.. ఆ బాకీని ఈ షోతో తీర్చేస్తారేమో చూడాలి.

17. అఖిల్ సార్థక్
- బిగ్ బాస్ రన్నరప్
- సీరియల్స్ లో నటుడు
-  సిసింద్రీ మూవీ విడుదల రోజున పుట్టటంతో అఖిల్ పేరును డిసైడ్ చేయటం.. గతంలో బిగ్ బాస్ హౌస్ లో రన్నరప్ గా నిలిచిన ఇతడు.. ఈసారి విన్నర్ అవుతాడా? లేదంటే మధ్యలోనే వెళ్లిపోతాడా? అన్నది చూడాలి.
Tags:    
  • Nagarjuna 
  • BiggBossNonStop 
  • Hotstar 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

Copyright @2026

Powered by Blink CMS