ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ బడ్జెట్ ని డిసైడ్ చేయనున్న 'ఆర్.ఆర్.ఆర్'..!
కరోనా మహమ్మారి కారణంగా సినీ ఇండస్ట్రీ గతంలో ఎప్పుడూ లేని విధంగా నాలుగు నెలలుగా మూతబడి ఉంది. దీంతో కొత్త సినిమాలతో థియేటర్స్ మొత్తం సందడిగా ఉండే సమ్మర్ సీజన్ ని కరోనా కాజేసింది. ఇప్పటికైనా పరిస్థితి చక్కబడితే థియేటర్స్ తెరుచుకుంటాయి అనుకుంటే రోజురోజుకి మహమ్మారి తీవ్ర రూపం దాల్చుతోంది. ఒకవేళ థియేటర్స్ తెరుచుకున్నా గతంలో మాదిరి ప్రేక్షకులు సినిమా చూడటానికి వస్తారనేది అనుమానమే. ఈ క్రమంలో భారీ బడ్జెట్ చిత్రాలకు పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తుందా లేదా అనే ఆలోచన ఇప్పటి నుంచే మేకర్స్ లో మొదలైంది. అందులోనూ ప్రభుత్వం థియేటర్ ఆక్యుపెన్సీ తగ్గించి అనుమతులు ఇస్తుంది అనే వార్తలు వస్తున్నాయి. దీంతో సీటింగ్ కెపాసిటీ సగానికి పైగా తగ్గే అవకాశం ఉంది. ఇదే కనుక జరిగితే మేకర్స్ భారీ ఓపెనింగ్స్ గురించి మర్చిపోవాల్సిందే. అందులోనూ రిలీజైన నెక్స్ట్ డే పైరసీ సైట్స్ లో సినిమా అందుబాటులో ఉంటున్న ఈ రోజుల్లో భారీ బడ్జెట్ సినిమాలు పరిస్థితి రాబోయో రోజుల్లో ఎలా ఉండబోతుందో అని ఆలోచిస్తున్నారు.
ఈ నేపథ్యంలో థియేటర్స్ ఓపెన్ చేసిన తర్వాత విడుదలయ్యే భారీ బడ్జెట్ సినిమాల టాక్ మరియు వసూళ్లను బట్టి రాబోయే సినిమాల విషయంలో అంచనా వేయవచ్చు. ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమాల్లో 'ఆర్.ఆర్.ఆర్' ఒకటి. ఇప్పటికే 70 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చెయ్యాలని చిత్ర యూనిట్ భావించింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అనుకున్న సమయానికి రాకపోవచ్చు. కాకపోతే రాబోయే రోజుల్లో ముందుగా రిలీజయ్యే భారీ చిత్రం మాత్రం 'ఆర్.ఆర్.ఆర్' అని చెప్పవచ్చు. అందుకే 'ఆర్.ఆర్.ఆర్' సినిమా సాధించే వసూళ్లను గమనించాలని మేకర్స్ అనుకుంటున్నారు. ఆ మూవీ కలెక్షన్స్ ఆధారంగా బడ్జెట్ గురించి ఆలోచించుకుంటే మంచిదనే అభిప్రాయానికి వస్తున్నారట. దీనిని బట్టి టాలీవుడ్ లో త్వరలో స్టార్ట్ కాబోతున్న భారీ సినిమాలన్నీ 'ఆర్.ఆర్.ఆర్' మీద ఆధారపడి ఉన్నాయి అని చెప్పవచ్చు.
కాగా ప్రస్తుతం అనౌన్స్ చేసిన భారీ ప్రాజెక్ట్స్ లో ప్రభాస్ - దీపికా పడుకునే కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా ఒకటి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ సినిమాని వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో నిర్మించడానికి రెడీ అయ్యారు. దీంతో పాటు దగ్గుబాటి రానాతో డైరెక్టర్ గుణశేఖర్ 'హిరణ్యకస్యప' అనే భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ మరియు గుణ టీమ్ వర్క్స్ కలిసి నిర్మించనున్నారు. అయితే థియేటర్స్ సామర్ధ్యం తగ్గిపోతే భారీ బడ్జెట్ మూవీస్ కి పెట్టుబడి మరియు లాభాలు రాబట్టడం కష్టం అవుతుంది. అందుకే వచ్చే ఏడాది విడుదల కానున్న 'ఆర్.ఆర్.ఆర్' మూవీ వసూళ్ల ఆధారంగా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఉండబోతున్నాయని చెప్పవచ్చు.