పాల బుగ్గల కోసం పాలకూర తినే కథానాయిక
సమ్మర్ లో మునుపటిలా అందాన్ని కాపాడుకోవడం అంత సులువేమీ కాదు. అతినీలలోహిత కిరణాలు ముఖవర్చస్సునే మార్చేస్తాయి. ఛర్మంపైనా డ్యామేజ్ తప్పదు. కానీ దానిని ఆపేందుకు చక్కని చిట్కాలు ఉన్నాయని అక్కినేని కోడలు సమంత చెబుతున్నారు. అంతేకాదు బుగ్గలపై ముఖంలో నునులేత అందం తరిగిపోకుండా ఉండాలంటే పాలకూర బచ్చలి కూర తినాలని అంటున్నారు సామ్.
అందం ఆరోగ్యం ఫిట్నెస్ పై ఎన్నో టిప్స్ చెబుతున్న సామ్ .. ఇస్తున్న తాజా టిప్ యువతరానికి బాగా నచ్చేసేదే. పైగా ఉదయం పూట ఆహారంతోనే సగం సమస్యకు పరిష్కారం చెబుతున్నారు సామ్.
ఉదయం అల్పాహారంగా సమంతా పాలకూర.. బచ్చలికూర .. సెలెరీ స్మూతీని తీసుకుంటుంది. దీనివల్ల కొల్లాజెన్ చెక్కుచెదరకుండా ఉంటుంది. నటి తన ఫిట్నెస్ ఇంటర్వ్యూలలో కొల్లాజెన్ ప్రాముఖ్యతను చాలాసార్లు వెల్లడించారు. మచ్చలేని చర్మం కలిగి ఉండటానికి చాలా కూరగాయలు .. ఆకుకూరలు.. పండ్లు.. కాయలు.. తీసుకుంటారు. ఆల్గే మాస్క్ లు కోల్డ్ ప్రెస్డ్ డ్రింక్స్ చాలా ముఖ్యమైనవి.
యోగాసనాలతో పాటు సూర్య నమస్కారాల్ని ప్రతి రోజు అనుసరిస్తారు. సూర్య నమస్కారాలు గరిష్టంగా 108 సార్లు చేస్తారు. ఆమె ఇషా క్రియా ప్రయాణం 48 రోజుల యోగా దినచర్యను కూడా అనుసరించారు. ఇది చర్మం ఆరోగ్యం.. మెరుపుపై కూడా గొప్ప ప్రభావాన్ని చూపుతుంది.
మచ్చలేని స్కిన్ సాన్స్ మేకప్ ఉపయోగించడమే కాదు... సమంతా తన చర్మ దినచర్యను వెల్లడించారు. వారానికి కనీసం ఐదు రోజులు వ్యాయామం చేయాలి. కఠినమైన-రసాయన ఉత్పత్తులకు దూరంగా ఆహారం సేకరించాలి. సేంద్రీయ చర్మ సంరక్షణ ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలి. షూట్ కోసం ప్రయాణించేటప్పుడు ఒకటికి రెండు సార్లు ముఖానికి టోన్ చేస్తుండడం అవసరం. అలాగే సామ్ కారులో వీట్ గ్రాస్ ట్రీట్మెంట్ కి సంబంధించిన ఫోటోని షేర్ చేశారు. తన మ్యాజిక్ పానీయాలను కూడా సమయానికి తీసుకోవాలనే దీని అర్థం. సామ్ టిప్స్ నేటి తరానికి ఉపకరిస్తాయనే భావిద్దాం.