కేజీఎఫ్-2 లో బాలయ్య.. ప్రకటించిన 'గూగుల్ తల్లి'!
‘కేజీఎఫ్..’ కన్నడ స్టార్ యశ్ హీరోగా తెరకెక్కిన ఈ పాన్ ఇండియా చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. గోల్డ్ మాఫీయా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీ.. ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే.
లాక్ డౌన్ ముందే మొదలైన కేజీఎఫ్ చాప్టర్-2.. విరామం తర్వాత శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన బంగారు గనుల సెట్లో ఈ మూవీని షూట్ చేస్తున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసింది యూనిట్. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. వచ్చే వేసవిలో గ్రాండ్ పాన్-ఇండియన్ మూవీగా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు.
కాగా.. ఈ చిత్రానికి సంబంధించిన ఓ న్యూస్ ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్న కేజీఎఫ్ చాప్టర్ 2లో నందమూరి బాలయ్య నటిస్తున్నాడన్నది ఆ వార్త సారాంశం. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడో.. నిర్మాతో వెల్లడించలేదు.. గూగుల్ ప్రకటించింది! గూగుల్ సెర్చ్ బార్‌లో కేజీఎఫ్-2 గురించి సెర్చ్ చేస్తే.. నటీనటుల జాబితాలో బాలయ్య పేరు కూడా వస్తోంది. అంతేకాదు.. నందమూరి నటసింహం ఫొటో కూడా కనిపించడం గమనార్హం. ఇనాయత్ ఖలీల్ పాత్రలో బాలయ్య కనిపించబోతున్నాడని గూగుల్ చెబుతుండడం విశేషం. నిజానికి ఈ పాత్రలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కనిపించబోతున్నాడని సమాచారం.
నెటిజన్లు తమకు ఏ సందేహం వచ్చినా.. గూగుల్ నే ఆశ్రయిస్తారు. ‘జై గూగుల్ తల్లి’ అంటూ చాలా మంది కామెడీ చేస్తుంటారు కూడా. అంత పర్ఫెక్ట్ సమాచారం అందించే గూగుల్ లో చోటు చేసుకున్న ఈ వి‘చిత్రం’ చూసి అందరూ నోరెళ్ల బెడుతున్నారు. ఈ 2020లో జరిగిన పెద్ద మిస్టేక్స్ లో ఇది కూడా ఒకటని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. పోనీలెండి ఏం చేస్తాం..? పొరపాట్లు మానవ సహజం అని సర్దుకు పోవడమే!"