తారకరత్న కుంగిపోతుంటే..బాలయ్య ఏమన్నాడు?

Update: 2016-05-02 11:30 GMT
ఒకేసారి తొమ్మిది సినిమాలు మొదలుపెట్టి రికార్డు సృష్టించిన హీరో తారకరత్న. అలాగే తెలుగులో హీరోగా అత్యధిక ఫెయిల్యూర్లు ఎదుర్కొన్న హీరోగా కూడా రికార్డు అతడి సొంతం. దశాబ్దంన్నర నుంచి హీరోగా నిలదొక్కుకోవడానికి పోరాడుతున్నాడు తారక్. కానీ ఇప్పటిదాకా సక్సెస్ అందుకోలేదు. ఐతే ఇన్ని ఫెయిల్యూర్లు ఎదురైనా ఇంకా ఇండస్ట్రీలో ఉండటం మాత్రం గొప్ప విషయమే. అందుకు ఎంతో గుండె నిబ్బరం.. ఆత్మవిశ్వాసం ఉండాలి. ఐతే అవి రెండూ తన బాబాయి బాలకృష్ణే తనకు ఇచ్చాడని అంటున్నాడు తారకరత్న.

‘‘ఒకేసారి తొమ్మిది సినిమాలు మొదలైనపుడు ఇక నేను సూపర్ స్టార్ అయిపోయినట్లే అనుకున్నా. కానీ ఆ తర్వాత దబేల్ మని కింద పడ్డాను. వరుస ఫెయిల్యూర్లతో కుంగిపోయాను. అప్పుడు బాబాయే నాకు ధైర్యం చెప్పారు. ‘లైఫ్ అనేది రోడ్ జర్నీ లాంటిది. మన ప్రయాణంలో ఒడుదొడుకులాంటాయి. స్పీడ్ బ్రేకర్లు వస్తాయి. వాటిని చూసి భయపడిపోకూడదు. ప్రయాణం ఆపకూడదు. సినిమాల్లో ఎలాంటి ఫలితాలు వచ్చినా ఆగిపోకూడదు. నీకంటూ ఓ రోజు వస్తుంది. కచ్చితంగా నువ్వు నిలబడతావు. ఏదైనా ఇబ్బంది వస్తే నీకు నేనున్నా. ఏం చేయాలన్నా చేస్తా’ అని బాబాయి నాకోసారి చెప్పాడు. ఆయనిచ్చిన ప్రోత్సాహంతోనే సినిమాల్లో కొనసాగాను. నాలో ఏదో టాలెంట్ లేకుంటే ఇన్నేళ్లు ఇండస్ట్రీలో ఉండేవాణ్నే కాదు కదా’’ అని తారకరత్న అన్నాడు. ‘రాజా చెయ్యి వేస్తే’లో తాను పోషించిన విలన్ పాత్రకు చాలా మంచి స్పందన వస్తోందని.. ఈ సినిమాతో తన కెరీర్ మలుపు తిరుగుతుందని ఆశిస్తున్నానని తారకరత్నచెప్పాడు.
Tags:    

Similar News