ఎన్టీఆర్ ని బాలయ్య లైట్ తీసుకున్నాడా?
టాలీవుడ్లో డైరెక్టర్ సందీప్ వంగా మొదలు పెట్టిన ‘బీ ది రియల్ మ్యాన్’ ఛాలెంజ్ ప్రస్తుతం సూపర్ సక్సెస్ అయింది. స్టార్స్ అంతా స్వీకరించి ఈ ఛాలెంజ్ ని పాపులర్ చేశారు. మన స్టార్ హీరోలందరూ ఇంటి పనులు చేయడం.. గరిటె పట్టుకొని వంట చేయడం ఈ ఛాలెంజ్ వల్లే సాధ్యమైంది. డైరెక్టర్ సందీప్ ఫస్ట్ ఈ ఛాలెంజ్ డైరెక్టర్ రాజమౌళికి నామినేట్ చేసాడు. రాజమౌళి ఈ ఛాలెంజ్ ని ఎన్టీఆర్, రామ్ చరణ్ లకు విసిరాడు. అలా ఈ ఛాలెంజ్ ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోల అందరి మధ్య ఇంటరెస్ట్ ఏర్పరిచింది. అయితే ఎన్టీఆర్ ఈ ఛాలెంజ్ పూర్తిచేసి సీనియర్ హీరోలు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలయ్యలను నామినేట్ చేసాడు.
ఇప్పటికే ఈ ఛాలెంజ్ ను మెగాస్టార్ పూర్తిచేశారు. మెగాస్టార్ ఛాలెంజ్ పూర్తి చేసి వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. `నేను రోజు చేసే పనులే.. ఇవ్వాళ మీకోసం ఈ వీడియో సాక్ష్యం` అంటూ తాను ఇల్లు క్లీన్ చేస్తూ అలాగే తన తల్లికి దోసెలు వేసి పెడుతున్న వీడియోను షేర్ చేశాడు. ఇక చిరు ఈ ఛాలెంజ్ ను తెలంగాణ మంత్రి కేటీఆర్, తన మిత్రుడు రజినీకాంత్ లకు విసిరారు. ఇక విక్టరీ వెంకటేష్ కూడా ‘బీ ది రియల్ మ్యాన్ ఛాలెంజ్’ ను ఇల్లు ఊడ్చి, ట్రిమ్మింగ్ తో పాటు వంట కూడా చేసి పూర్తిచేసాడు. ఆయన వీడియోని తన అధికారిక ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు.
ఎన్టీఆర్ నామినేట్ చేసిన వారిలో బాబాయ్ బాలయ్య, నాగార్జున మాత్రమే మిగిలి ఉన్నారు. ఎన్టీఆర్ నామినేట్ చేస్తే బాలయ్య స్పందించకపోవడంతో సోషల్ మీడియాలో అనేక సందేహాలు రేకెత్తుతున్నాయి. బాలయ్య చీపురు పట్టడు.. అని కొందరంటే, మరికొందరెమో ఎన్టీఆర్ బాలయ్య మధ్య మనస్పర్థలు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారు. బాలయ్య ఈ ఛాలెంజ్ చేయకపోతే మాత్రం ఆ మాట నిజమేనని అందరు బలంగా నమ్ముతారు. మరి ఇకనైనా బాలయ్య రియాక్ట్ అవుతారేమో చూడాలి. ఇక హీరో నాగార్జున కూడా ఈ టాస్క్ పూర్తి చేయాల్సి ఉంది.