బెల్లంకొండ బాలీవుడ్‌ మూవీ కోసం 'బాహుబలి' రైటర్‌

Update: 2020-11-23 08:50 GMT
బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా బాలీవుడ్‌ లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు అనేది గత కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలు. ప్రభాస్‌ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చత్రపతికి రీమేక్‌ గా బెల్లంకొండ బాలీవుడ్‌ మూవీ ఉంటుందనే విషయం జోరుగా ప్రచారం జరుగుతోంది. దర్శకుల విషయమై కూడా అనేక వార్తలు వచ్చాయి. ఇప్పుడు చత్రపతి సినిమా ఈతరం హిందీ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా మార్చి రాసే పనిలో ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ ఉన్నాడు.

బాలీవుడ్‌ లో బాహుబలి రైటర్‌ గా విజయేంద్ర ప్రసాద్‌ కు మంచి పేరు వచ్చింది. సల్మాన్ ఖాన్‌ మూవీతో పాటు చాలా సినిమాలకు ఆయన రచయితగా వ్యవహరించి టాప్‌ రచయితల జాబితాలో ఉన్నాడు. అలాంటి విజయేంద్ర ప్రసాద్‌ తో రీమేక్‌ కోసం స్ర్కిప్ట్‌ రెడీ చేయిస్తున్నారు. ముఖ్యంగా కొన్ని యాక్షన్‌ సీన్స్‌ కు సంబంధించి మార్పులు చేర్పులు చేయిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

బెల్లంకొండ ఇమేజ్ కు తగ్గట్లుగా బాలీవుడ్‌ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా చత్రపతిని మార్చే పనిని విజయేంద్ర ప్రసాద్‌ తన భుజాలపై పెట్టుకున్నాడట. స్క్రిప్ట్‌ వర్క్‌ అయిన తర్వాత అప్పుడు షూటింగ్‌ కు వెళ్లబోయే ముందు దర్శకుడి పేరును అధికారికంగా ప్రకటిస్తారనే వార్తలు వస్తున్నాయి. ప్రభుదేవా నుండి వినాయక్‌ వరకు ఎంతో మంది పేరు ఈ రీమేక్‌ కు గాను వినిపిస్తున్నాయి.
Tags:    

Similar News