ఎంజీఆర్ సినిమాతో బాహుబలి పోలికలు
మద్రాసు పరిశ్రమ అభివృద్ధిలో ఎంజీఆర్ పాత్ర విస్మరించలేనిది. సౌత్ మొత్తానికి తమిళనాడు సినిమా కేంద్రంగా విరాజిల్లడానికి ఎంజీర్ హీరోయిజమే కారణం అని చెబుతుంటారు. ఏఎన్నార్, ఎన్టీఆర్ అంతటి ఉద్ధండులే ఎంజీఆర్ ని ఇన్ స్పిరేషన్ గా తీసుకుని నటించేవారని చెబుతారు. అంతటి గొప్ప పర్సనాలిటీ, దివంగత హీరో సినిమా ఒకటి ఫిలింనగర్ చర్చల్లోకొచ్చింది.
ఎంజీఆర్ హీరోగా 1969లో తెరకెక్కిన 'అడిమాయ్ పెన్' చిత్రానికి బాహుబలితో పోలికలు ఉన్నాయి. ఆ చిత్రంలోని కొన్ని సన్నివేశాల్ని ప్రతిబింబించేలా బాహుబలిలో కొన్ని సన్నివేశాలున్నాయని చెబుతున్నారు. మాహిష్మతి సామ్రాజ్యంలోకి అడుగుపెట్టిన శివుడిని క్రమక్రమంగా రివీల్ చేసే సన్నివేశాల్లో.. అతడిని చూసి బాహుబలి బాహుబలి బాహుబలి అని జపిస్తారు అక్కడి ప్రజలు. ఆ సన్నివేశం ఎంజీఆర్ సినిమాలోనిదే. అక్కడి నుంచి ఇన్ స్పయిర్ అయ్యి రాసుకున్నదే అని కొత్త ప్రచారం ఒకటి ఊపందుకుంది. ఆ సన్నివేశంలో వేలాది మంది జూనియర్ ఆర్టిస్టుల్ని ఉపయోగించాడు రాజమౌళి.
అక్కడ శివుడి(బాహుబలి వారసుడు)ని చూసుకున్న ప్రజలు దేవుడిని చూసినట్టే ఫీలవుతారు. అమరేంద్ర బాహుబలికి కట్టప్ప విధేయుడు అని నిరూపించే సన్నివేశంలో... కట్టప్ప పాత్రధారి సత్యరాజ్ కి రాజమౌళి ఓ మాట చెప్పారు. ఒక గ్రామంలోకి ఎంజీఆర్ వస్తే ఆ గ్రామ ప్రజలు ఎలా రియాక్టవుతారు. సరిగ్గా బాహుబలి అతడే అని తెలిశాక అందరి ముఖాల్లో అలాంటి పీలింగునే చూడాలి అని రాజమౌళి సూచించారు. కట్టప్ప అలానే నటించాడు కూడా.