మన బాహుబలి ఆయనకు ఊపునిచ్చింది...

Update: 2015-08-10 16:36 GMT
ప్రియదర్శన్... ఈ పేరు చెప్పగానే కాలాపాని అనే సినిమా గుర్తొస్తుంది. ఒకవేళ ఇండియన్ ఫిలిం హిస్టరీని ఓ బుక్ గా రాస్తే.. అందులో ఈ సినిమా, ప్రియదర్శన్ పేరు ఖచ్చితంగా ఉంటాయి. ఈ సినిమాకి వచ్చిన అవార్డులన్నిటినీ లెక్కపెట్టాలంటే ఓ పూట పడుతుంది ఎవరికైనా. అంతటి ప్రతిభావంతుడైనా దర్శక దిగ్గజం ప్రియదర్శన్. ఈయన కూడా బాహుబలి చూసి ముగ్ధులైపోయిన వాళ్లలో చేరిపోయారు.

తనకు ఓ మూవీ తీయడానికి బాహుబలి ఇన్ స్పిరేషన్ అయిందని చెబ్తున్నారు ప్రియదర్శన్‌. మళయాళ సినీ పరిశ్రమలోనే అత్యంత భారీ బడ్జెట్ తో ఓ సినిమా తెరకెక్కించబోతున్నారు ఈయన. దీనిలో మోహన్ లాల్ లీడ్ కేరక్టర్ పోషించనుండగా.. రష్యా, అజర్బేజన్ దేశాల నటులు కూడా భాగం కానున్నారు. తొలి ఇండో-అజర్బేజన్ మూవీగా ఈ చిత్రం చరిత్రలో నిలిచిపోనుంది కూడా.

తన భారీ ప్రాజెక్టు విషయాన్ని.. మొన్నటి సైమా 2015 అవార్డుల ఫంక్షన్ లో అఫీషియల్ గా ప్రకటించారు ప్రియదర్శన్. దాదాపు 28కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా చిత్రీకరిస్తామని, ఇంత భారీ ప్రాజెక్టు ప్రారంభించడానికి... తనకు స్ఫూర్తినిచ్చిన చిత్రం బాహుబలి అంటూ చెప్పారాయన. మొత్తానికి చరిత్ర సృష్టించడమే కాదు... సినీ పరిశ్రమలో కొత్త చరిత్రలు రాసినవారికీ జక్కన్న ఆదర్శంగా నిలవడం విశేషమే.
Tags:    

Similar News