సర్వేలో బాహుబలికి మరో అరుదైన ఘనత

Update: 2019-01-24 15:06 GMT
సౌత్‌ సినిమాలు హిందీ సినిమాల స్థాయిలో వసూళ్లు సాధించడం కష్టం - కనీసం ఆ స్థాయిలో ఉండవంటూ నార్త్‌ వారు ఎద్దేవ చేస్తున్న సమయంలో 'బాహుబలి' చిత్రంతో రాజమౌళి సౌత్‌ సత్తా చాటాడు. బాలీవుడ్‌ చిత్రాలను మించి బాహుబలి వసూళ్లు సాధించింది. బాహుబలి మొదటి పార్ట్‌ బాలీవుడ్‌ వర్గాల దృష్టిని ఆకర్షించగా - బాహుబలి 2 చిత్రం బాలీవుడ్‌ రికార్డులను బద్దలు కొట్టి - బాలీవుడ్‌ బాద్‌ షాలకే సాద్యం కాని వసూళ్లను దక్కించుకుంది. బాలీవుడ్‌ స్టార్‌ హీరోల సినిమాల కంటే కూడా అధికంగా బాహుబలి నార్త్‌ లో వసూళ్లు సాధించింది. ఎన్నో అవార్డులు - రివార్డులు దక్కించుకుని - పలు ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌ లో ప్రదర్శింపబడిన ఈ చిత్రం మరో అరుదైన ఘనత సొంతం చేసుకుంది.

ప్రముఖ మీడియా సంస్థ ఓర్మాక్స్‌ మీడియా ఈ దశాబ్దపు మోస్ట్‌ లైక్డ్‌ మూవీ జాబితా కోసం ఒక సర్వే నిర్వహించింది. ఆ సర్వేలో పలు విషయాలను పరిగణలోకి తీసుకుని 100 పాయింట్లను ఇవ్వాల్సిందిగా సర్వేలో పాల్గొన్న వారికి సూచించింది. ఆ సర్వేలో 90 పాయింట్లు దక్కించుకుని అమీర్‌ ఖాన్‌ '3 ఇడియట్స్‌' మొదటి స్థానంలో నిలువగా - 85 పాయింట్లతో 'బాహుబలి 2' చిత్రం రెండవ స్థానంలో - 83 పాయింట్లతో 'బాహుబలి' చిత్రం మూడవ స్థానంలో నిలిచింది. బాలీవుడ్‌ మోస్ట్‌ లైక్ డ్‌ హిందీ సినిమాల జాబితాలో బాహుబలి రెండు పార్ట్‌ లు టాప్‌ 3 లో ఉండటం మామూలు విషయం కాదు.

ఈ పదేళ్లలో హిందీలో ఎన్నో చిత్రాలు వచ్చాయి. అద్బుతమైన విజయాలను దక్కించుకున్నాయి. కాని అక్కడి ప్రేక్షకులు మాత్రం ఒక డబ్బింగ్‌ సినిమాను ఇంతగా అభిమానించడం - ఇష్టపడటం అంటే రాజమౌళికే చెందింది. బాహుబలి రెండు పార్ట్‌ లు కూడా రెండు - మూడు స్థానాల్లో నిలవడం పట్ట నిర్మాత శోభు యార్లగడ్డ స్పందిస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇక మరో సౌత్‌ మూవీ 'కేజీఎఫ్‌' చిత్రం ఏడవ స్థానంలో నిలిచింది.

1. 3 ఇడియట్స్‌(90),
2. బాహుబలి 2(85),
3. బాహుబలి(83),
4. దంగల్‌(82),
5. బాఘ్‌ మిల్కా బాఘ్‌(82),
6. సంజు(80),
7. కేజీఎఫ్‌(80),
8. క్వీన్‌(78),
9. భజరంగీ భాయిజాన్‌(77),
10. బర్ఫీ(77)
Tags:    

Similar News