OG సీక్వెల్ ఎప్పుడు? పవన్ ప్లాన్ ఏంటి?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.;
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఆ సినిమా ఉగాది కానుకగా భారీ అంచనాలతో థియేటర్స్ లో రిలీజ్ అయింది. కానీ మిక్స్ డ్ రెస్పాన్స్ తో కొనసాగుతోంది. అయితే ఉస్తాద్ రిలీజ్ అయిన నుంచి పవన్ అప్ కమింగ్ మూవీస్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
నిజానికి ఇప్పటికే పవన్ లైనప్ లో డైరెక్టర్ సురేందర్ రెడ్డితో మూవీతోపాటు ఓజీ సీక్వెల్ ఉంది. అదే సమయంలో మోహన్ రాజా, దేవ కట్టా వంటి దర్శకులతో చర్చలు జరుపుతున్నారంటూ వార్తలు వచ్చాయి. దీంతో పవన్ సొంత నిర్మాణ సంస్థ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నుంచి ప్రకటన విడుదలైన సంగతి తెలిసిందే. పవన్ ఎలాంటి కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలిపింది.
ఆయన కొత్త ప్రాజెక్టుల గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టత చేసింది. ప్రస్తుతం కొత్త సినిమాలు ప్రారంభించే అర్జెంట్ ప్లాన్స్ లేవని, ఏవైనా కొత్త అప్డేట్లు ఉంటే అధికారిక మార్గాల ద్వారా తెలియజేస్తారని చెప్పింది. అదే సమయంలో ఓజీ 2 మూవీ విషయానికొస్తే, దానికి సంబంధించి ఏదైనా అప్డేట్ ఉంటే సరైన సమయంలో పవన్ కళ్యాణఅ స్వయంగా పంచుకుంటారని వెల్లడించింది.
దీంతో ఇప్పుడు ఓజీ 2 ఎప్పుడనే విషయంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది. పవన్ ప్లాన్ ఏంటోనని అంతా మాట్లాడుకుంటున్నారు. అయితే పవన్ ప్రస్తుతం అటు ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చూసుకుంటూనే.. ఇటు సినిమాలు చేసేందుకు ఫిక్స్ అయ్యారు. ఇప్పటికే సురేందర్ రెడ్డి మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని.. త్వరలో షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం.
పవన్ షెడ్యూల్ బిజీగా ఎప్పుడూ ఉండడం వల్ల ఆ సినిమా కంప్లీట్ అవ్వడానికి కచ్చితంగా టైమ్ పడుతుంది. ఇప్పుడు ఉన్న సమాచారం ప్రకారం.. ఆ మూవీ అయ్యాక ఓజీ సీక్వెల్ తెరకెక్కే ఛాన్స్ ఉంది. కానీ ఓజీ డైరెక్టర్ సుజీత్ మాత్రం ఎప్పుడు ఫ్రీ అవుతారో తెలియదు. ఎందుకంటే ఆయన ఇప్పుడు నేచురల్ స్టార్ నానితో ఓ భారీ పాన్ ఇండియా సినిమాను గట్టిగా ప్లాన్ చేస్తున్నారు.
నానితో సుజీత్ చేయాల్సిన సినిమా.. ఈ ఏడాదిలో స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ భారీ మూవీ కాబట్టి పూర్తి అవ్వడానికి టైమ్ పట్టవచ్చు. అది అయ్యాక పవన్ ఫ్రీగా ఉంటే పర్లేదు. అలా కాకుండా ఆయన బిజీ అయితే సుజీత్.. వేరే హీరోతో ఇంకో సినిమా వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. కాబట్టి ఓజీ 2 ఎప్పుడు అనేది ఎవరూ చెప్పలేం. అది పవన్ షెడ్యూల్ తో పాటు సుజీత్ ప్లాన్ పై ఆధారపడి ఉంటుంది. మరి ఓజీ సీక్వెల్ ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు మొదలవుతుందో వేచి చూడాలి.