ఆ హీరోయిన్ ప్లాన్ ఏంటి? నిర్మాతలకు ఇబ్బందులు తప్పవా?
అయితే పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉండాల్సిన సమయంలో.. ఆమె తీసుకుంటున్న నిర్ణయాలు నిర్మాతలకు మాత్రం తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.;
సినీ ఇండస్ట్రీలో ఓ యంగ్ హీరోయిన్ ప్రవర్తన ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఆ బ్యూటీ ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుండగా.. త్వరలో తన ప్రియుడితో పెళ్లి చేసుకోబోతుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉండాల్సిన సమయంలో.. ఆమె తీసుకుంటున్న నిర్ణయాలు నిర్మాతలకు మాత్రం తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి.
ఆ హీరోయిన్ ప్రస్తుతం మూడు సినిమాల్లో నటించాల్సి ఉంది. సంక్రాంతి తర్వాత షూటింగ్స్ కు హాజరు కావాలని ముందుగానే ఒప్పందాలు చేసుకున్నప్పటికీ, ఇప్పటివరకు ఆమె ఒక్క సెట్స్ లోకి ఎంట్రీ ఇవ్వలేదని సమాచారం. ఆయా చిత్రాల నిర్మాతలు పలుమార్లు తేదీలు అడిగినా, బిజీగా ఉన్నాననే సమాధానమే వస్తోందట. దీంతో ఈ ప్రాజెక్టులు అన్నీ హోల్డ్ లో ఉన్నాయని టాక్ వినిపిస్తోంది.
సాధారణంగా ఒక హీరోయిన్ ఇలా వరుసగా షూటింగ్లను మిస్ అవ్వడం అరుదే. ముఖ్యంగా కెరీర్ మంచి దశలో ఉన్న సమయంలో ఇలాంటి వ్యవహారం సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారుతోంది. ఈ నేపథ్యంలో ఆమె వ్యక్తిగత జీవితంలో ఏదైనా మార్పులు జరిగాయా? లేక పెళ్లి విషయమై ఏదైనా గందరగోళం ఉందా? అన్న అనుమానాలు కూడా ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి.
ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆ హీరోయిన్ ప్రేమలో ఉన్న వ్యక్తి కూడా సినీ రంగానికి చెందినవారేనట. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారని, కుటుంబాల అంగీకారంతో త్వరలో వివాహం జరుగుతుందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఆ ప్లాన్స్ లో ఏదైనా మార్పు వచ్చిందా? అనే సందేహం కూడా వ్యక్తమవుతోంది.
అయితే నిర్మాతలు మాత్రం హీరోయిన్ విషయంలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేసి, లోకేషన్లు బుక్ చేసి, భారీగా ఖర్చు పెట్టిన నేపథ్యంలో హీరోయిన్ డేట్స్ లేకపోవడం వల్ల నష్టాలు వాటిల్లే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. కొందరు నిర్మాతలు ఆమెతో నేరుగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, సరైన క్లారిటీ మాత్రం రాలేదట.
ఇండస్ట్రీలో ఇలాంటి సంఘటనలు గతంలో కూడా చోటుచేసుకున్నాయి. కానీ ఎక్కువ సందర్భాల్లో హీరోయిన్లు తమ ప్రొఫెషనల్ కమిట్మెంట్స్ కు ప్రాధాన్యత ఇచ్చి, సమస్యలను త్వరగా పరిష్కరించేవారు. అయితే ఈసారి మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఆ విషయంపై చర్చ జోరుగా సాగుతోంది. కొందరు నెటిజన్లు ఆమె వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యత ఇవ్వడం సహజమేనని అంటుంటే, మరికొందరు ప్రొఫెషనల్ లైఫ్ ను నెగ్లెట్ చేయడం సరైంది కాదని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా యంగ్ హీరోయిన్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రస్తుతం నిర్మాతలకు తలనొప్పిగా మారాయట.