రాజుగారి వారసుడు నాలుగేళ్లగా ఖాళీగానే!
స్టార్ ప్రొడ్యూసర్ ఎమ్.ఎస్.రాజు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన సుమంత్ అశ్విన్ టాలీవుడ్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు.;
స్టార్ ప్రొడ్యూసర్ ఎమ్.ఎస్.రాజు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన సుమంత్ అశ్విన్ టాలీవుడ్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు.`తూనీగ తూనీగ` చిత్రంతో ఎంతో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చిన సుమంత్ కొన్నాళ్ల పాటుబిజీగానే కనిపించాడు. `అంతకు ముందు ఆ తర్వాత`, `లవర్స్`, `కేరింత`, `ఫ్యాషన్ డిజైనర్` లాంటి చిత్రాలతో తనదైన ముద్ర వేసాడు. ముఖ్యంగా యూత్ పుల్ ఎంటర్ టైనర్లతో యువతకు బాగా కనెక్ట్ అయ్యాడు. కానీ కొన్ని వైఫల్యాలు సుమంత్ ను రేస్ నుంచి వెనక్కి నెట్టాయి? అన్నది అంతే వాస్తవం. ఈ యువ హీరో గత నాలుగేళ్లుగా వెండి తెరకు దూరంగా ఉంటున్నాడు.
చివరగా 2022లో రిలీజ్ అయిన `7 డేస్ 6 నైట్స్` చిత్రం తర్వాత ఆయన మరే చిత్రంలోనూ నటించలేదు. `7 డేస్ 6 నైట్` చిత్రాన్ని ఎమ్.ఎస్. రాజు దర్శకత్వంలోనే రిలీజ్ అయింది. ఆ సినిమాపై తండ్రీ కొడుకులిద్దరు చాలా ఆశలే పెట్టుకున్నారు. కానీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద సోసోగానే నిలిచింది. ఆ సినిమా విడుదలైనప్పటి నుండి ఇప్పటి వరకు అంటే దాదాపు నాలుగేళ్లుగా సుమంత్ నుంచి మరో అనౌన్స్‌మెంట్ రాలేదు. ప్రస్తుతం టాలీవుడ్‌లో విపరీతమైన పోటీ నెలకొంది. ప్రతి నెలా కొత్త హీరోలు పరిచయమవుతున్న తరుణంలో నాలుగేళ్ల లాంగ్ గ్యాప్ అనేది యంగ్ హీరో కెరీర్‌కు కొంత ఇబ్బందికరమైన విషయమే.
ఒకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న సుమంత్ అశ్విన్ పూర్తిగా ఖాళీగా ఉండటం ఆయన అభిమానులను కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే ఈ విరామం కేవలం కథల వేట కోసమేనా లేక ఇతర వ్యాపార రంగాల్లో బిజీగా ఉండటం వల్లేనా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సుమంత్ అశ్విన్ తన తండ్రి నిర్మాణ సంస్థ అయిన సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బాధ్యతలతో బిజీగా ఉన్నారా? అంటే ఆ సంస్థ కొంత కాలంగా సినిమాలు కూడా నిర్మిచడం లేదు. ఆ సంస్థలో చాలా సెలక్టివ్ గా సినిమాలు నిర్మిస్తుంటారు. ప్రస్తుతం నిర్మాణ వ్యయం కూడా బాగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే.
దీంతో చాలా సంస్థలు నిర్మాణం వైపు ఆసక్తి చూపించడం లేదు. ఈ సంస్థ కూడా అదే ఫేజ్ లో ఉందా?ణ అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ గ్యాప్ లోనే సుమంత్ వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టాడు. దీపిక అనే అమ్మాయితో అతడి వివాహం జరిగింది. పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమవ్వడం ఆసక్తికరం. మరి రాజుగారి వారసుడు నాలుగేళ్లుగా సైలెంట్‌గా ఉన్నా? లోలోపల ఏదైనా బలమైన ప్లానింగ్ జరుగుతోందా? అన్నది తెలియాలి. త్వరలోనే ఒక క్రేజీ ప్రాజెక్టుతో సుమంత్ అశ్విన్ ప్రేక్షకుల ముందుకు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.