సీనియర్ హీరోల యంగ్ స్ట్రాటజీ!
తాజాగా చిరంజీవి దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ కల్ట్ చిత్రం చేయడానికి రెడీ అవుతున్నారు. దర్శకుడిగా శ్రీకాంత్ కు ఇది మూడవ చిత్రం మాత్రమే. అయినా అన్నయ్య ఎక్కడా వెనక్కి తగ్గలేదు.;
టాలీవుడ్ లో ఇప్పుడు ఒక సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పుడు సీనియర్ హీరోలు కేవలం అనుభవజ్ఞులైన దర్శకులతోనే పనిచేయడానికి మొగ్గు చూపేవారు. కానీ మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా తమను తాము కొత్తగా ఆవిష్కరించుకోవడానికి సీనియర్ స్టార్లు యంగ్ డైరెక్టర్ల వైపు చూస్తున్నారు. ఈ యంగ్ స్ట్రాటజీ టాలీవుడ్‌లో సరికొత్త రికార్డులకు పునాది వేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ఈ విషయంలో ముందు వరుసలో ఉన్నారు. ఈ ఏడాది సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు చిత్రంతో 400 కోట్ల వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటారు.
తాజాగా చిరంజీవి దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఓ కల్ట్ చిత్రం చేయడానికి రెడీ అవుతున్నారు. దర్శకుడిగా శ్రీకాంత్ కు ఇది మూడవ చిత్రం మాత్రమే. అయినా అన్నయ్య ఎక్కడా వెనక్కి తగ్గలేదు. తన మార్క్ హిట్ ఇస్తాడు? అనే నమ్మకంతో ముందుకెళ్తున్నారు. ఈ చిత్రాన్ని నేచురల్ స్టార్ నాని సమర్పిచడం అన్కనది మరో ఎత్తు. ఈ ఛాన్స్ తో చిరంజీవి కుర్ర హీరోలకు ఏమాత్రం తీసిపోని ఎనర్జీతో మరో సినిమా చేస్తున్నారని క్లారిటీ వచ్చేసింది. అలాగే నటసింహ నందమూరి బాలకృష్ణ కూడా పంథా మార్చుకున్నారు. వరుస హిట్లతో దూసుకుపోతున్న బాలయ్య తన 112వ సినిమా కోసం సరిపోదా శనివారం ఫేమ్ వివేక్ ఆత్రేయకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారంలో ఉంది.
క్లాస్ కథలు రాసే వివేక్ ఆత్రేయ బాలయ్య కోసం ఓ పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ క్రేజీ కాంబినేషన్ 2027 సమ్మర్ కానుకగా విడుదలయ్యే అవకాశం ఉంది. బాలయ్య మాస్ ఇమేజ్‌కు వివేక్ ఇంటెలిజెంట్ స్క్రీన్‌ప్లే తోడైతే బాక్సాఫీస్ వద్ద జాతరే. అక్కినేని నాగార్జున తొలి నుంచి కొత్త దర్శకులను ప్రోత్సహించడంలో ముందుంటారు. తాజాగా తన ప్రతిష్టాత్మక 100వ సినిమా బాధ్యతలను కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ కార్తీక్ తంగవేలుకు అప్పగించిన సంగతి తెలిసిందే. దర్శకుడిగా కార్తీక్ కి పెద్దగా అనుభవం లేదు. తొలి సినిమా కూడా భారీ విజయం సాధించింది లేదు.
కానీ నాగ్, కార్తీక్ కథను, మేకింగ్ ను నమ్మి ముందుకెళ్తున్నారు. ల్యాండ్ మార్క్ చిత్రాన్నే కార్తీక్ చేతుల్లో పెట్టారంటే యంగ్ మేకర్ ని కింగ్ ఎంతగా నమ్ముతున్నారు? అన్నది అద్దం పడుతుంది. నాగ్ కెరీర్‌లో మైలురాయిగా నిలిచిపోయే చిత్రమవుతుందని అభిమానులంతా కాన్పిడెంట్ గా ఉన్నారు. విక్టరీ వెంకటేష్ కూడా ఈ యంగ్ డైరెక్టర్ల రేసులో వెనుకబడలేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆదర్శ కుటుంబం పూర్తి చేసిన వెంటనే తన ఫేవరెట్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో మరోసారి చేతులు కలపనున్నారు. ఈ చిత్రంలో నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం.
దగుబాటి - నందమూరి హీరోలను ఒకే తెరపై చూపించడం అనీల్ కు ఇదే తొలిసారి. 2027 సంక్రాంతికి ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ను అందించబోతున్నారు. మొత్తానికి టాలీవుడ్ సీనియర్ హీరోలు తమ అనుభవాన్ని యంగ్ డైరెక్టర్ల కొత్త ఆలోచనలతో జోడించి బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించేందుకు సిద్ధమయ్యారు. ఈ మార్పు కేవలం వసూళ్లకే కాకుండా తెలుగు సినిమా పరిధిని పెంచడానికి కూడా దోహదపడుతోంది.