ఫౌజీ, డ్రాగన్.. ఏం జరుగుతోంది? బడ్జెట్ పెరిగిందా?

అయితే అటు ఫౌజీ, ఇటు డ్రాగన్ ను నిర్మిస్తోంది టాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్సే.;

Update: 2026-03-25 00:30 GMT

టాలీవుడ్ స్టార్ హీరోలంతా తమ తమ సినిమాలతో బిజీగా ఉండగా.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫౌజీ, డ్రాగన్ చిత్రాల కోసం జోరుగా చర్చ సాగుతోంది. ఆ రెండు సినిమాల బడ్జెట్లు బాగా పెరిగాయని.. దీంతో నిర్మాతలకు ఆర్థికపరంగా టెన్షన్ మొదలైందని టాక్ వినిపిస్తోంది. అంత భారీ బడ్జెట్ పెడితే.. కచ్చితంగా వసూళ్లు కూడా అంతే రీతిలో రావాలి. లేకుంటే ఇబ్బందులు తప్పవనే చెప్పాలి.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్ లో నటిస్తున్న మూవీ ఫౌజీ. సీతారామంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా.. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ఆ మూవీతో ఇమాన్వీ హీరోయిన్‌ గా పరిచయం అవుతోంది. జయప్రద, అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, భానుచందర్ వంటి దిగ్గజ నటులు ఫౌజీలో కీలక పాత్రలు పోషిస్తుండడం విశేషం.

ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఆడియన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆగస్టు 15వ తేదీన ఫౌజీ రిలీజ్ అవుతుందని ఆ మధ్య ప్రచారం జరగ్గా.. షూటింగ్ పెండింగ్ ఉండడంతో అక్టోబర్ కు వాయిదా పడిందని తెలుస్తోంది. దసరా కానుకగా రిలీజ్ కానుందట. చిత్రీకరణ ఆలస్యమవ్వడంతో బడ్జెట్ బాగా పెరిగినట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది.

అదే సమయంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ లీడ్ రోల్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న మూవీ డ్రాగన్! తారక్ సరసన యంగ్ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ యాక్టర్ అనిల్ కపూర్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. వారితో పాటు పలువురు స్టార్ నటీనటులు భాగమైనట్లు తెలుస్తోంది. మాస్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఆ మూవీ షూటింగ్ కూడా ప్రస్తుతం జరుగుతోంది.

నిజానికి ఆ సినిమా జులైలో రిలీజ్ చేస్తామని కొద్ది రోజుల మేకర్స్ అనౌన్స్ చేశారు. కానీ ఇప్పటి వరకు షూటింగ్ సగం మాత్రమే పూర్తి అయినట్లు తెలుస్తోంది. దీంతో అనుకున్న తేదీకి సినిమా రిలీజ్ కావడం కష్టమేనని టాక్ వినిపిస్తోంది. అందుకే ఇంకా కొన్ని నెలలపాటు షూటింగ్ జరగనుందని అర్థమవుతోంది. అలా డ్రాగన్ మూవీ బడ్జెట్ కూడా పెద్ద ఎత్తున పెరుగుతుందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.

అయితే అటు ఫౌజీ, ఇటు డ్రాగన్ ను నిర్మిస్తోంది టాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్సే. ఇప్పటికే ఆ బ్యానర్ లైనప్ లో అనేక సినిమాలు ఉండగా.. ఇప్పుడు ఫౌజీ, డ్రాగన్ చిత్రాల రిలీజులు పోస్ట్ పోన్ అవుతుండడంతో పెద్ద తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. అంతే కాదు.. నిర్మాతలు ఒత్తిడికి లోనవుతున్నారని సమాచారం. మరి ఆ చిత్రాలు ఎలాంటి హిట్ అవుతాయో.. ఎంతటి వసూళ్లు సాధిస్తాయో అంతా వేచి చూడాలి.

Tags:    

Similar News