ధురంధర్, డ్రాగన్.. ఈ కంపేరిజన్ ఏంటి?

దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న డ్రాగన్ ఇప్పటికే ఫాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలు సొంతం చేసుకుంది. వచ్చే ఏడాది జూన్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Update: 2026-06-29 04:00 GMT

పెద్ద సినిమాలకు సీక్వెల్స్ రావడం ఇప్పుడు కొత్త విషయం కాదు. కానీ రెండు పార్టులను చాలా తక్కువ గ్యాప్ లో విడుదల చేయడం మాత్రం అరుదుగా కనిపించే ట్రెండ్. ఇటీవల బాలీవుడ్‌ లో వచ్చిన ధురంధర్ ఫ్రాంచైజీ అదే విధానాన్ని ఫాలో అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అదే తరహా చర్చ టాలీవుడ్‌ లో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ సినిమాపై జరుగుతోంది.

దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న డ్రాగన్ ఇప్పటికే ఫాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలు సొంతం చేసుకుంది. వచ్చే ఏడాది జూన్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇది కేవలం మొదటి భాగమేనని, రెండో భాగాన్ని కూడా అదే ఏడాది డిసెంబర్‌ లో విడుదల చేసేలా మూవీ టీమ్ సిద్ధం చేస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌ గా మారింది.

అయితే ధురంధర్ ఫ్రాంచైజీ మొదటి భాగం విడుదలైన కొద్ది నెలలకే రెండో భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. రెండు సినిమాలూ మంచి రెస్పాన్స్ అందుకోవడంతో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించాయి. కథలో కంటిన్యూషన్ ఉండటం, ప్రేక్షకుల్లో ఆసక్తిని నిలబెట్టడం ఆ ఫ్రాంచైజీ విజయానికి ప్రధాన కారణాలుగా చెప్పుకున్నారు.

ఇప్పుడు అదే తరహాలో డ్రాగన్ కూడా రెండు భాగాలుగా వస్తే ఎలా ఉంటుందనే చర్చ మొదలైంది. ఒకే ఏడాదిలో ఆరు నెలల గ్యాప్ లో ఎన్టీఆర్ రెండు సినిమాలు విడుదలైతే అభిమానులకు పండుగే. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ సినిమాలకు ఉండే భారీ స్కేల్, యాక్షన్ ఎలిమెంట్స్, పాన్ ఇండియా మార్కెట్‌ ను దృష్టిలో పెట్టుకుంటే ఆ ప్లాన్ ఆసక్తికరంగా కనిపిస్తోందని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు.

అయితే కేవలం రిలీజ్ ప్లాన్ ఒకటే విజయాన్ని నిర్ణయించదని కూడా సినీ ప్రియులు గుర్తు చేస్తున్నారు. రెండు భాగాల కథకు స్ట్రాంగ్ కంటెంట్ ఉండాలి. మొదటి భాగం ప్రేక్షకుల్లో రెండో భాగంపై ఆసక్తిని పెంచేలా ముగియాలి. రెండో భాగం ఆ అంచనాలను అందుకునే స్థాయిలో ఉండాలి. అప్పుడు మాత్రమే ఇలాంటి ప్లానింగ్‌ కు పూర్తి స్థాయిలో ఫలితం దక్కుతుందని చెప్పాలి.

ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో సీక్వెల్స్‌ కు మంచి ఆదరణ కనిపిస్తోంది. ప్రేక్షకులు కూడా ఒక మంచి కథను రెండు లేదా అంతకంటే ఎక్కువ భాగాల్లో చూడటానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రతి సినిమా ధురంధర్ తరహాలో విజయాన్ని అందుకుంటుందనే గ్యారంటీ లేదు. కథ, కథనం, పాత్రలు, ఎమోషన్స్, యాక్షన్ వంటి అంశాలు బలంగా ఉన్నప్పుడే సీక్వెల్ ఫార్మాట్‌ కు అసలు వాల్యూ ఉంటుంది.

మరోవైపు డ్రాగన్ నిజంగానే రెండు భాగాలుగా వస్తుందా? రెండో భాగం కూడా అదే ఏడాది విడుదల అవుతుందా? అనే విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఏదేమైనా ధురంధర్ ఫ్రాంచైజీ ఫాలో అయిన తక్కువ గ్యాప్‌ లో రెండు పార్టుల రిలీజ్ ప్లాన్ ను ఇప్పుడు డ్రాగన్ తో పోలుస్తున్నారు. అయితే ఆ కంపేరిజన్ నిజం కావాలంటే ఒకే ఒక్క అంశం కీలకం. అది కంటెంట్. కథ బలంగా ఉంటే తక్కువ గ్యాప్‌ లో వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారు. లేకపోతే ఎంత పెద్ద స్టార్, ఎంత బడ్జెట్ ఉన్నా ఆశించిన రిజల్ట్ రావడం కష్టమే.

Tags:    

Similar News