అక్కడ రాజమౌళికి పర్మనెంట్ సీటు
తెలుగు సినిమా స్థాయిని గ్లోబల్ రేంజ్‌కు తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం ఫ్రాన్స్ పర్యటనలో ఉన్నారు.
తెలుగు సినిమా స్థాయిని గ్లోబల్ రేంజ్‌కు తీసుకెళ్లిన దర్శకుడు రాజమౌళి ప్రస్తుతం ఫ్రాన్స్ పర్యటనలో ఉన్నారు. తన పాత సినిమాల స్పెషల్ స్క్రీనింగ్స్ కోసం యూరప్ వెళ్లిన ఆయనకు అక్కడ ఊహించని రేంజ్‌లో మంచి రెస్పాన్స్ వస్తోంది. అక్కడి ప్రేక్షకుల నుంచి మాత్రమే కాకుండా ఫ్రాన్స్ సినీ ప్రముఖుల నుంచి కూడా ఆయనకు ఇప్పుడు ఒక అరుదైన గౌరవం దక్కింది. ఫ్రాన్స్‌లో ప్రతిష్టాత్మక ఆర్ట్స్ సెంటర్ సినిమాటిక్ ఫ్రాంచైజ్ లో రాజమౌళికి ఒక అద్భుతమైన గుర్తింపు లభించింది.
ఈ ఆర్ట్స్ సెంటర్ లో ఎంతో ప్రత్యేకమైన హెన్రీ లాంగ్లోయిస్ హాల్‌లో ఏకంగా ఆయన పేరుతో ఒక పర్మనెంట్ సీటును కేటాయించారు. ఒక ఇండియన్ ఫిల్మ్ మేకర్ కు ఇలాంటి అరుదైన గుర్తింపు దక్కడం నిజంగా ఒక స్పెషల్ మూమెంట్ అని చెప్పాలి. ఈ కార్యక్రమం ఏదో ఒక సాధారణ ఈవెంట్‌లా కాకుండా అక్కడి దిగ్గజ ఫిల్మ్ మేకర్ చేతుల మీదుగా జరగడం దీనికి మరింత వెయిట్ తీసుకొచ్చింది.
ఆస్కార్ అవార్డు గ్రహీత ప్రముఖ ఫ్రెంచ్ దర్శకుడు కోస్టా గావ్రాస్ ఆధ్వర్యంలో ఆ సంస్థ నిర్వాహకులు రాజమౌళికి ఈ గౌరవాన్ని అందించారు. అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన ఒక అగ్ర దర్శకుడు తెలుగు డైరెక్టర్‌ను స్వయంగా సత్కరించడం చాలా పాజిటివ్ విషయం. తనకి దక్కిన ఈ అరుదైన గౌరవం పట్ల రాజమౌళి కూడా చాలా ఎమోషనల్ గా స్పందించారు. ఫ్రాన్స్ పర్యటనలో తనకు ఇలాంటి సర్ ప్రైజ్ ఎదురవుతుందని తాను కలలో కూడా ఊహించలేదని అన్నారు.
తనకు దక్కిన ఈ గుర్తింపు పట్ల ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఆ సర్టిఫికెట్ అందుకున్న ఫోటోలను అభిమానుల కోసం షేర్ చేశారు. మహేష్ బాబుతో చేయబోయే సినిమా గ్లోబల్ ప్రమోషన్స్‌లో భాగంగానే రాజమౌళి ఈ ఫ్రాన్స్ టూర్ ప్లాన్ చేశారనే సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇలాంటి ఇంటర్నేషనల్ ఆర్ట్స్ సెంటర్లలో ఆయనకు లభిస్తున్న ఈ గుర్తింపు చూస్తుంటే ఆ రాబోయే భారీ ప్రాజెక్టుకు ఇది ఒక సాలిడ్ బేస్ క్రియేట్ చేసేలా కనిపిస్తోంది.
విదేశీ మార్కెట్లోకి ఎంటర్ కావడానికి ఇలాంటి పాజిటివ్ వైబ్స్ ఎంతగానో హెల్ప్ అవుతాయి. ఒకప్పుడు మన రీజినల్ కథలతో సినిమాలు తీసిన రాజమౌళి ఇప్పుడు ఏకంగా ఫ్రాన్స్ లాంటి దేశాల్లో తనకంటూ ఒక పర్మనెంట్ స్థానాన్ని సంపాదించుకోవడం ఒక గ్రేట్ అచీవ్ మెంట్. ఇంటర్నేషనల్ లెవెల్ లో టాలీవుడ్ మార్కెట్ కు పెరుగుతున్న రీచ్ కు ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో టాలీవుడ్ కంటెంట్ కు అక్కడ మరింత ఆదరణ దక్కుతుందని అర్ధమవుతుంది. ఇక వారణాసికి ఎలాంటి ఓపెనింగ్స్ వస్తాయో చూడాలి.