• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  OTTల‌పై మాట‌కు...

OTTల‌పై మాట‌కు క‌ట్టుబ‌డిన ఒకే ఒక్క నిర్మాత కం హీరో

| భారతీయ సినీ పరిశ్రమలో ఓటీటీ (OTT) విప్లవం వచ్చిన తర్వాత థియేటర్ల ఉనికి ప్రశ్నార్థకమైందని చాలామంది నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

By - Sivaji Kontham
Update: 2026-03-25 03:45 GMT

భారతీయ సినీ పరిశ్రమలో ఓటీటీ (OTT) విప్లవం వచ్చిన తర్వాత థియేటర్ల ఉనికి ప్రశ్నార్థకమైందని చాలామంది నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే కేవలం మాటలకే పరిమితం కాకుండా.. ఓటీటీల దూకుడుకు పక్కాగా ముకుతాడు వేసిన ఏకైక హీరో కం నిర్మాతగా అమీర్ ఖాన్ నిలుస్తున్నారు. థియేటర్ వ్యవస్థను కాపాడటమే లక్ష్యంగా ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారాయి.

సాధారణంగా టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చాలామంది నిర్మాతలు తమ సినిమా విడుదలైన ఎనిమిది వారాల వరకు ఓటీటీలో స్ట్రీమింగ్ చేయకూడదనే `8 వారాల రూల్` గురించి మాట్లాడతారు. కానీ ఆచరణలోకి వచ్చేసరికి అదనపు ఆదాయం కోసం కేవలం నాలుగు వారాలకే సినిమాలను ఓటీటీలకు ఇచ్చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తన మాటపై నిలబడి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లను ఒక్కడిగానే ఢీకొడుతున్నారు మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్.

ఓటీటీల వల్ల ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిపోతోంద‌ని... దీనివల్ల ఎగ్జిబిషన్ రంగం పూర్తిగా విధ్వంసం అవుతోందని అమీర్ ఖాన్ గతంలోనే తన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తన సొంత సినిమాల విషయంలో ఆయన చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. థియేటర్ అనుభవాన్ని ప్రేక్షకులు పూర్తిగా పొందిన తర్వాతే.. అది కూడా చాలా నెలల గ్యాప్ తర్వాతే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో సినిమా స్ట్రీమ్ అవ్వాలని ఆయన గట్టిగా నమ్ముతున్నారు.

అమీర్ ఖాన్ నిర్మించి నటించిన తాజా చిత్రం `సితారే జమీన్ పర్` ఇందుకు ఒక చక్కని ఉదాహరణ. గతేడాది జూన్ 20న విడుదలైన ఈ సినిమా ఆరు నెలలు దాటినా ఇప్పటివరకు ఏ ఓటీటీలోనూ ప్రత్యక్షం కాలేదు. భారీ ఆఫర్లు వచ్చినా.. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో సినిమా వచ్చే గ్యాప్ విషయంలో ఆయన ఏమాత్రం రాజీ పడలేదు. థియేటర్ వ్యవస్థను గౌరవించడం కోసం ఎంతటి ఆర్థిక ప్రయోజనాన్నైనా వదులుకోవడానికి ఆయన సిద్ధపడ్డారు.

ఎట్టకేలకు నెలల నిరీక్షణ తర్వాత `సితారే జమీన్ పర్` ఇప్పుడు సోనీ లివ్ లో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. ఇతర స్టార్ హీరోల సినిమాలు నెల రోజుల్లోనే ఫోన్లలోకి వచ్చేస్తున్న తరుణంలో అమీర్ ఖాన్ తన సినిమాను ఇంతకాలం ఆపడం విశేషం. ఈ పోరాటం థియేట్రికల్ రంగానికి ఒక కొత్త ఊపిరి పోస్తుందని మిగిలిన హీరోలు కూడా ఇలాగే స్పందిస్తే పరిశ్రమ మళ్ళీ పూర్వ వైభవం సంతరించుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవ‌ల తెలుగు చిత్రసీమ‌లోను 8 వారాల విండో నియ‌మాన్ని నిర్మాత‌లు ఆమోదించార‌ని క‌థ‌నాలొచ్చాయి. హిందీ సినీరంగంలానే టాలీవుడ్ లోను ఎనిమిది వారాల‌పాటు ఓటీటీలలో స్ట్రీమింగ్ లేకుండా నియ‌మాన్ని పాటిస్తే అది ఒక గొప్ప మ‌లుపుగా భావించాలి.

Tags:    
  • aamirkhan 
  • ott 
  • theatres 
  • bollywood 
  • cinema 
  • filmindustry 
  • aamirkhanupcomingmovies 

Similar News

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

Copyright @2026

Powered by Blink CMS