మరో గొప్ప ఘనత సాధించిన బాహుబలి
ఇండియన్ సినిమా కనీ వినీ ఎరుగని రికార్డిది. ఓ సినిమా కేవలం మన దేశంలోనే రూ.500 కోట్ల వసూళ్లు సాధించింది. ఆ ఘనత మన ‘బాహుబలి’దే కావడం విశేషం. బాలీవుడ్ సినిమాలకు కూడా సాధ్యం కాని రికార్డిది. బాహుబలి దేశీయ గ్రాస్ వసూళ్లు రూ.500 కోట్లకు చేరుకున్నాయి. మొత్తంగా బాహుబలి రూ.570-580 కోట్ల మధ్య గ్రాస్ వసూళ్లు సాధించింది. రూ.730 కోట్ల వసూళ్లతో పీకే సినిమా నెంబర్ వన్ స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. బాహుబలి తర్వాత విడుదలైన ‘భజరంగి భాయిజాన్’ రూ.600 కోట్లకు పైగా వసూలు చేసింది. ఐతే ఓవరాల్ వసూళ్లలో బాహుబలి ఈ రెండు సినిమాల తర్వాతి స్థానంలో ఉన్నప్పటికీ.. దేశీయ వసూళ్లలో మాత్రం ఎప్పుడో నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది.
పీకే దేశీయ వసూళ్లు దాదాపు రూ.330 కోట్లే కావడం విశేషం. ఆ సినిమా ఓవర్సీస్ లో భారీ కలెక్షన్లు రాబట్టింది. అవి దేశీయ వసూళ్ల కంటే ఎక్కువే. చైనాలో సైతం విడుదలైన పీకే వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇక భజరంగి భాయిజాన్ దేశీయ వసూళ్లు రూ.360 కోట్ల దాకా ఉన్నాయి. ఈ రెండు సినిమాలు బాహుబలికి దరిదాపుల్లో లేవు. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లోనూ భారీ వసూళ్లు రాబట్టింది బాహుబలి. మొత్తంగా బాహుబలి షేర్ రూ.300 కోట్ల దాకా ఉండొచ్చని అంచనా. త్వరలోనే చైనా సహా కొన్ని దేశాల్లో ఇంటర్నేషనల్ వెర్షన్ విడుదల చేయబోతున్నారు కాబట్టి.. పీకే రికార్డుల్ని కూడా బద్దలు కొట్టేసి.. ఇండియాస్ హైయెస్ట్ గ్రాసర్ గా బాహుబలి చరిత్ర సృష్టించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.