బాహుబలి.. ఇప్పటికీ తగ్గట్లేదు

Update: 2015-08-17 11:44 GMT
సినిమాలు వస్తున్నాయ్.. పోతున్నాయ్.. కానీ బాహుబలి ప్రభంజనం మాత్రం ఇప్పటికీ తగ్గట్లేదు. అందులోనూ తమ సినిమాలు తప్ప వేరే వాళ్ల సినిమాల్ని ఆదరించని తమిళనాట బాహుబలి హవా మామూలుగా లేదు. ఆరో వారానికి కూడా ఆ సినిమా చెన్నై బాక్సాఫీస్ లో సత్తా చాటుకుంటుండటం విశేషం. బాహుబలి విడుదలయ్యాక దాదాపు పది సినిమాలు విడుదలయ్యాయి. అందులో స్టార్ హీరో ధనుష్ సినిమా ‘మారి’ కూడా ఉంది. ఐతే ఆ సినిమా కూడా బాహుబలి ముందు నిలవలేకపోయింది. విడుదలైన నాలుగు వారాల తర్వాత కూడా బాహుబలి నెంబర్ వన్ పొజిషన్ లో ఉండటం విశేషం. ఐతే ఈ శుక్రవారం రెండు క్రేజీ మూవీస్ థియేటర్ల లోకి దిగాయి. అవి శింబు కథానాయకుడిగా నటించిన వాలు, ఆర్య-సంతానం-తమన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘వాసువుం సరవణవుం ఒన్నా పడిచవంగ’.

ఈ రెండు సినిమాలకు వీకెండ్ లో భారీ కలెక్షన్లు దక్కాయి. చెన్నై బాక్సాఫీస్ లో తొలి రెండు స్థానాలు వాటివే. ఐతే మూడో స్థానం మన బాహుబలికే దక్కింది. ఆరో వీకెండ్ లో కూడా బాహుబలి వసూళ్లు కోట్లల్లో ఉండటం విశేషం. తమిళంలో ఈ సినిమాను విడుదల చేసిన జ్నానవేల్ రాజా ఇప్పటికే భారీగా లాభాలు మూటగట్టుకున్నాడు. ఇంకా కౌంటింగ్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే ‘బాహుబలి’ తమిళ వెర్షన్ యాభై కోట్ల క్లబ్ లో అడుగుపెట్టింది. విడుదలకు ముందు బాహుబలి శాటిలైట్ రైట్స్ రెండు మూడు కోట్లకు అడిగారు. ఐతే విడుదల తర్వాత ఆ సినిమా ప్రభంజనం చూశాక విపరీతమైన పోటీ నెలకొంది. ఓ ప్రముఖ ఛానెల్ రూ.8 కోట్లు పెట్టి బాహుబలి శాటిలైట్ రైట్స్ తీసుకోవడం విశేషం.
Tags:    

Similar News