అన్ని ధియేటర్లు ఎక్కడివి బాహుబలి?

Update: 2017-04-26 07:01 GMT
బాహుబలి 2 విడుదలకి కి ఇంకా కొద్ది రోజులు మాత్రమే ఉంది. అందుకోసం బాహుబలి టీమ్ మార్కెటింగ్ ట్రిక్స్ ఉపయోగించి సక్సెస్ స్థాయి పెంచడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. బాహుబలి మొదటి భాగానికి బోలెడంత పబ్లిసిటీ హంగామా చేసిన టీం.. ఇప్పుడు ఆ స్థాయిలో కాకపోయినా.. ప్రచార జోరు బాగానే పెంచారు.

బాహుబలి2 ఏప్రిల్ 28న దేశవ్యాప్తంగా 7000కు పైగా స్క్రీన్ లలో విడుదల కానుంది. తెలుగు వెర్షన్ 3000 స్క్రీన్లు.. తమిళ్- మలయాళం- హిందీ వెర్షన్లను 4000 స్క్రీన్ లతో విడుదల చేయనున్నారని చెబుతున్నారు. అయితే ట్రేడ్ పండితులు మాత్రం.. ఇది ఒక పెద్ద నెంబర్ మ్యాజిక్ అని తేల్చేస్తున్నారు. ఇంత వరకు ఏ పెద్ద సినిమా అయనా 5000 స్క్రీన్ లకు మించి విడుదల కాలేదని.. .అన్నీ స్క్రీన్ లు ఒక్క సినిమాకు ఇచ్చేటంత మన దేశంలో థియేటర్లు కూడా లేవని అంటున్నారు. అయితే.. ఈ సినిమాకు ఉన్న క్రేజ్ కారణంగా.. మహా అయితే 5000 స్క్రీన్ దొరుకుతాయి అని అంటున్నారు.

ఇప్పటికే బాహుబలి స్క్రీనింగ్ విషయం లో ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వాలు డైలీ షోస్ ను పెంచుకునేందుకు అనుమతుసలు ఇచ్చాయి. ఇన్ని మార్కెట్ ట్రిక్ లతో పక్కా  ప్లాన్ తో వస్తున్న జక్కన్న మూవీ.. జనాల అంచనాలను అందుకోవడంపైనే ఇప్పుడంతా ఆసక్తి కనిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News