బాహుబలి 2 ఫస్ట్ డే: తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే..

Update: 2017-04-29 07:13 GMT
నిన్న రిలీజైన ''బాహుబలి 2'' సినిమా దాదాపు అన్ని ఏరియాల్లోనూ అద్భుతమైన ఓపెనింగ్స్ ను పట్టేసింది. దాదాపు అన్ని ధియేటర్లలోనూ బాహబలి 2 సినిమానే రిలీజ్ కావడం వలన.. ఇప్పుడు కలక్షన్లు విపరీతంగా పెరిగిపోయాయ్. గతంలో వచ్చినదానికంటే డబుల్ వచ్చేసింది.

నిన్న (ఏప్రియల్ 28) రిలీజైన బాహుబలి2 .. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్ర నుండి 28 కోట్ల షేర్.. నైజాం నుండి 8.9 కోట్లు షేర్.. అలాగే సీడెడ్ నుండి 6.35 కోట్లు షేర్ రాబట్టింది ఈ సినిమా. ఇందులో తొలిరోజుకు ముందు ఇచ్చిన అడ్వాన్సులు కూడా కలిపే ఉంటాయ్ లెండి. అయితే బాహుబలి 1 మాత్రం 2015లో కేవలం 22.40 కోట్లు షేర్ వసూలు చేసింది. ఆ తరువాత ఖైదీ నెం 150 ఆ రికార్డును బ్రేక్ చేస్తూ తెలుగు రాష్ట్రాల్లో 23.24 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు అటువంటి డే 1 రికార్డులన్నింటినీ బ్రేక్ చేస్తూ బాహుబలి 2 ఏకంగా 43.26 కోట్లు షేర్ వసూలు చేయడం విశేషం.

కాకపోతే ఎప్పుడూ నైజాం ఏరియాలో ఆంధ్ర రాష్ట్రంలో కంటే షేర్లే ఎక్కువగా వస్తాయి. కాని ఈసారి భారీ అడ్వాన్సులను కూడా కలపడం కారణంగానేమో.. బాహుబలి 2 విషయంలో నైజాం కంటే ఆంధ్రలో కలక్షన్లు ఎక్కువగా వచ్చాయ్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News